లవర్‌ బాయ్‌ తరుణ్‌ రీఎంట్రీ, ఈ సారి.. | Hero Tarun Getting Ready For Re Entry With New Story‌ | Sakshi
Sakshi News home page

లవర్‌ బాయ్‌ తరుణ్‌ రీఎంట్రీ‌

Published Wed, Mar 24 2021 10:14 PM | Last Updated on Wed, Mar 24 2021 10:14 PM

Hero Tarun Getting Ready For Re Entry With New Story‌ - Sakshi

తొలి ఏడేళ్లలో తరుణ్ నుంచి దాదాపు 14 సినిమాలు వస్తే.. ఆ తర్వాత 14 ఏళ్లలో ఈయన నుంచి 7 సినిమాలు కూడా రాలేదు

తరుణ్‌..టాలీవుడ్‌లో ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి లవర్‌ బాయ్‌గా  పేరు పొందాడు. అతితక్కువ సమయంలోనే స్టార్‌ హీరోగా మారాడు. తొలి సినిమా ‘నువ్వే కావాలి’తో రికార్డులు సృష్టించి టాలీవుడ్‌ లవర్‌ బాయ్‌గా విశేష ప్రేక్షకాదరణ పొందాడు. 2000వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా.. అప్పట్లోనే 20 కోట్లకు పైగా షేర్‌ వసూళ్లు సాధించిదంటే తరుణ్‌కు ఉన్న క్రేజీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అత్యదిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో అప్పట్లో ఆ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అందుకుంది.

ఆ తర్వాత నువ్వులేక నేను లేను, నువ్వే నువ్వే వంటి  సూపర్‌ హిట్‌ సినిమాలతోతరుణ్‌ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. తరుణ్‌ సినిమా అంటే మినిమమ్‌ గ్యారెంట్‌ అని నిర్మాతలకు గట్టి నమ్మకం ఉండేది. అయితే  కొన్ని తొందరపాటు నిర్ణయాలతో ఈయన కెరీర్ దారుణంగా దిగజారిపోయింది. వరుసగా లవ్‌ స్టోరీలనే చేస్తూ రావడం తరుణ్‌కు మైనస్‌గా మారింది. వరస ప్లాప్స్ తో కెరీర్ లో వెనుకబడ్డాడు.

తొలి ఏడేళ్లలో తరుణ్ నుంచి దాదాపు 14 సినిమాలు వస్తే.. ఆ తర్వాత 14 ఏళ్లలో ఈయన నుంచి 7 సినిమాలు కూడా రాలేదు. తరుణ్ చివరగా 2017లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా చేశాడు. అది కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడటంతో తరుణ్‌ తీవ్ర నిరాశ చెందాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాల జోలికి వెళ్లలేదు. చాలా గ్యాప్‌ తర్వాత తరుణ్‌ మళ్లీ వెండితెరపై మెరవబోతున్నాడు. నాలుగేళ్ళ అనంతరం తన స్నేహితుడితోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. తన ఫ్రెండ్‌ రాసిన లవ్‌ స్టోరీ తరుణ్ కు బాగా నచ్చిందట. అంతేకాదు తరుణ్ ఈ సినిమాకు నిర్మాతగా మారనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.  ప్రస్తుతం తరుణ్‌ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement