కోలీవుడ్ సినీ రంగంలోనే కాదు.. రాజకీయ రంగంలోనూ వేడి వేడిగా వినిపిస్తున్న పేరు విజయ్. ఇందుకు కారణం అందరికీ తెలిసిందే. సినీ రంగంలో టాప్ హీరోగా రాణిస్తున్న విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే. ఈయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'. విజయ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, మైక్ మోహన్, అజ్మహల్, జయరామ్, ప్రేమ్జీ, వైభవ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సరదాగా జరుగుతోంది. దీంతో విజయ్ తన 69వ చిత్రానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదే ఈయన చివరి చిత్రం అవుతుంది అని కూడా ప్రచారం జరుగుతోంది. కాగా ఇది కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ లిస్టులో దర్శకుడు అట్లీ, వెట్రిమారన్, కార్తీక్ సుబ్బరాజ్, ఆర్జే బాలాజీ,హెచ్ వినోద్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఇందులో కార్తీక్ సుబ్బరాజు గానీ, ఆర్జే బాలాజీ గానీ, విజయ్ 69 చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.
ఇకపోతే ఇందులో విజయ్ సరసన నటించే నటి ఎవరన్నది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నటి సమంతను నాయకిగా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కాలేదన్నది గమనార్హం. ఇదే గనుక నిజమైతే నటి సమంత విజయ్‌తో జతకట్టే నాలుగో చిత్రం ఇది అవుతుంది. ఇంతకుముందు మెర్సల్, తేరి చిత్రాల్లో సమంత నటుడు విజయ్‌తో జత కట్టారు అన్నది గమనార్హం. లేకపోతే ఇటీవల మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత ఆ తర్వాత కథానాయకిగా నటించే భారీ దక్షిణాది చిత్రం ఇదే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment