ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఇది చాలాసార్లు ప్రూవ్ అయిన విషయమే. కలిసి పెరిగిన వాళ్లు కావొచ్చు, కలిసి ఒకేచోట పనిచేస్తున్న వాళ్లు కావొచ్చు ప్రేమలో పడుతుంటారు. అలా ఇప్పుడు ఓ కన్నడ డైరెక్టర్.. తన సినిమాలో హీరోయిన్‌గా చేసిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. పెళ్లి వరకు వచ్చేశాడు. తాజాగా తన బంధాన్ని అఫీషియల్ చేస్తూ వివాహ తేదీని ప్రకటించాడు.
(ఇదీ చదవండి: విడాకులు తీసుకున్నా.. కానీ హ్యాపీగానే ఉన్నా: స్టార్ హీరో భార్య)
తరుణ్ సుధీర్.. చైల్డ్ ఆర్టిస్టుగా 1990లోనే కన్నడ ఇండస్ట్రీకి వచ్చేశాడు. 2019 వరకు అప్పుడప్పుడు నటిస్తూ వచ్చాడు. మరోవైపు రైటర్గానూ స్టార్ హీరోల సినిమాలకు పనిచేశాడు. 2017లో 'చౌక' అనే మూవీ తీశాడు. దీని తర్వాత 'రాబర్ట్', 'కాటేరా' చిత్రాలు చేశాడు. ఇక 'రాబర్ట్' చేస్తున్న టైంలో అందులో నటించిన సోనాలి మొంటిరోతో ప్రేమలో పడ్డాడు. కాకపోతే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడు.
తాజాగా తామిద్దరం ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టిన తరుణ్, సోనాలి.. ఆగస్టు 11న బెంగళూరులో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే డైరెక్టర్, హీరోయిన్‌గా తాము ఎలా ప్రేమలో పడ్డాం అనేది సింబాలిక్‌గా చూపిస్తూ వెడ్డింగ్ వీడియో రూపొందించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా)
Comments
Please login to add a commentAdd a comment