ప్రముఖ లేడీ యాంకర్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం | Anchor Aparna Vastarey Passed Away With Cancer | Sakshi
Sakshi News home page

Aparna Vastare: క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించిన ప్రముఖ యాంకర్ కమ్ నటి

Jul 12 2024 11:05 AM | Updated on Jul 12 2024 11:28 AM

Anchor Aparna Vastarey Passed Away With Cancer

ప్రముఖ లేడీ యాంకర్ అపర్ణ వస్తారే కన్నుమూశారు. గత రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడిన ఈమె.. గురువారం రాత్రి మరణించారు. ఈ విషయాన్ని అపర్ణ భర్త చెప్పుకొచ్చారు. కన్నడలో గత 40 ఏళ్లుగా నటిగా, యాంకర్, న్యూస్ యాంకర్‌గా చేసిన ఈమె ఇప్పుడు ఇలా మృతి చెందడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తన సంతాపాన్ని తెలియజేశారు.

(ఇదీ చదవండి: ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు)

1984లోనే నటిగా కెరీర్ ప్రారంభించిన ఈమె.. డీడీ చందన ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీటితో పాటే ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించారు. 1998లో దీపావళి ప్రోగ్రాంకి దాదాపు ఎనిమిది గంటల పాటు యాంకరింగ్ చేసి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం బెంగళూరు మెట్రోలో వినిపించే అనౌన్స్‌మెంట్‌కి వాయిస్ ఇచ్చింది ఈమెనే కావడం విశేషం.

ఇక బిగ్ బాస్ కన్నడ షోలోనూ పాల్గొన్న ఈమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే కన్నడలో అద్భుతమైన డిక్షన్‌తో యాంకర్‌గా ఈమెని కొట్టేవాళ్లు లేరని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు ఈమె మృతి పట్ట సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

(ఇదీ చదవండి: విజయ్‌ దేవరకొండ సాయం.. ట్రాన్స్‌ జెండర్‌​ కంటతడి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement