![సావిత్రీ గణేశుడు](/styles/webp/s3/article_images/2017/09/5/51492973809_625x300.jpg.webp?itok=hs271ADU)
సావిత్రీ గణేశుడు
అలనాటి అందాలతార సావిత్రి జీవితంలో కీలక వ్యక్తి తమిళ నటుడు ‘జెమిని’ గణేశన్. సావిత్రి జీవిత కథతో నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ సంస్థ ‘మహానటి’ సినిమా తీయనున్నట్టు ప్రకటించగానే... ‘జెమిని’ గణేశన్ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది? ఎవరు నటిస్తారు? అనే డిస్కషన్ మొదలైంది. తమిళ హీరో సూర్య నుంచి ప్రకాశ్‌రాజ్ వరకు పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి.
చివరకు, ‘జెమిని’ గణేశన్ పాత్రకు మలయాళ స్టార్ మమ్ముట్టి తనయుడు, మణిరత్నం ‘ఓకే బంగారం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్‌ను తీసుకున్నారు. తొలుత తెలుగు, తమిళ భాషల్లో తీయాలనుకున్న ఈ సినిమాను ఇప్పుడు మలయాళంతో కలిపి మూడు భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సావిత్రిగా కీర్తీ సురేశ్, జర్నలిస్ట్‌గా సమంత నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే రెండో వారంలో మొదలు కానుంది. అనుష్కను ఈ సినిమాలో కీలక పాత్ర (భానుమతి/జమున?) కు సంప్రదించిన సంగతి తెలిసిందే.