‘మహానటి’కి కౌంటర్‌ | Documentary On Gemini Ganesan Life | Sakshi
Sakshi News home page

May 20 2018 1:36 PM | Updated on May 20 2018 1:37 PM

Documentary On Gemini Ganesan Life - Sakshi

ప్రస్తుతం వెండితెరపై బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ఇటీవల మహానటి సినిమాతో ఈ ట్రెండ్‌ దక్షిణాదిలోనూ ఊపందుకుంది. తాజాగా మరో బయోపిక్‌ తెరమీదకు రానుంది. అయితే ఆ బయోపిక్‌ మహానటి కి కౌంటర్‌గా తెరకెక్కుతుండటం విశేషం. మహానటి సినిమాలో జెమినీ గణేషన్‌ పాత్రను తప్పుగా చూపించారని ఆయన కూతురు డాక్టర్‌ కమల ఆరోపిస్తున్నారు. తన తండ్రి అవకాశాలు రాక సావిత్రి వేదించినట్టుగా తాగుబోతుగా చూపించారని అది నిజం కాదని ఆమో వాదిస్తున్నారు.

అంతేకాదు త్వరలో జెమినీ గణేషన్ కథతో ఓ డాక్యుమెంటరినీ రూపొందిస్తున్నట్టుగా కమల వెల్లడించారు. మహానటి వివాదం తెర మీదకు వచ్చిన తరువాత జర్నలిస్ట్‌ అనుపమా సుబ్రమణియంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మహానటిలో కేవలం ఒక వైపు నుంచి మాత్రమే చూపించారని అందుకే తన తండ్రి అసలు ఎలాంటి వారో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్టుగా తెలిపారు. గంటా నలబై నిమిషాల నిడివితో రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీని చెన్నైతో పాటు హైదరబాద్‌లోనూ మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement