
ఆమెది ఈమె.. ఈమెది ఆమె
మహానటి సావిత్రి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ మహానటి సినిమాలో నిత్యామీనన్ ఓ కీలకమైన పాత్ర పోషించనున్నట్టుగా గతంలో వార్తలొచ్చాయి.
మహానటి సావిత్రి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ మహానటి సినిమాలో నిత్యామీనన్ ఓ కీలకమైన పాత్ర పోషించనున్నట్టుగా గతంలో వార్తలొచ్చాయి. అయితే, అంతలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ... ఆమె స్థానంలో సమంత పేరు వచ్చింది. ఇదిలా వుండగానే సమంత చేయాల్సివున్న మరో సినిమా ఆఫర్ ఇప్పుడు నిత్యామీనన్ చేతి కెళ్లింది.
కన్నడంలో 'యూ టర్న్' పేరిట తెరకెక్కిన ఓ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఈ సినిమాలో తొలుత పాత్ర చేయాలనుకున్న శామ్.. కొన్ని కారణాలతో వదిలేసుకుంది. దీంతో ఆ చాన్స్ నిత్యాకు దక్కింది. ఇప్పటికే నిత్యామీనన్ 'యూ టర్న్' తెలుగు రీమేక్‌కి సైన్ చేసినట్టు తెలుస్తోంది.