బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రేకులకుంట గ్రామంలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.
బుక్కరాయసముద్రం(అనంతపురం జిల్లా): బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రేకులకుంట గ్రామంలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..రేకులకుంట గ్రామంలో సావిత్రి(28) భర్త నారాయణ కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు.
సావిత్రి కొన్ని రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడుతోంది. మనవోదనకు గురైన సావిత్రి సోమవారం మద్యాహ్నం ఇంట్లో ఉరేసుకుంది. స్థానికులు గమనించి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.