ప్రయోగానికి రెడీ అవుతున్న బన్నీ | Allu Arjun Next Movie With Vikram Kumar | Sakshi
Sakshi News home page

Published Wed, May 2 2018 1:19 PM | Last Updated on Wed, May 2 2018 1:20 PM

Allu Arjun Next Movie With Vikram Kumar - Sakshi

ఈ శుక్రవారం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ సరికొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాతో మరో ఘన విజయం ఖాయం అన్న నమ్మకంతో ఉన్నాడు.

ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే సినిమాపై చర్చ మొదలైంది. వరుసగా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లు చేస్తూ వస్తున్న అల్లు అర్జున్‌ తన నెక్ట్స్ సినిమా కాస్త డిఫరెంట్‌గా చేసే ఆలోచనలో ఉన్నాడట. లింగుస్వామి దర్శకత్వంలో గతంలో ఓ సినిమా ప్రారంభమైనా ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్‌ కనిపించటం లేదు. దీంతో ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట బన్నీ. ఈ సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. మరి వీటిలో బన్నీ ఏ ప్రాజెక్ట్‌ను ముందుగా స్టార్ట్‌ చేస్తాడో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement