ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా నడుస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరో క్రేజీ కాంబోకు రంగం సిద్ధమైనట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్, ధనుష్ హీరోలుగా ఓ చిత్రం రానున్నట్టు సమాచారం.
కొరటాల శివ దర్శకత్వంలో ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమైనట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రం రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత జూ.ఎన్టీఆర్ సినిమాతో బిజీ కానున్నారని సమాచారం. ఇక ఆ చిత్రం పూర్తి చేసిన వెంటనే బన్నీ, ధనుష్ కాంబో మూవీపై కొరటాల శివ దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
Dhanush: అల్లు అర్జున్, ధనుష్ హీరోలుగా భారీ మల్టీస్టారర్..!
Published Wed, Mar 30 2022 12:11 AM | Last Updated on Wed, Mar 30 2022 8:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment