multi starrer movie
-
నాని, మహేష్ బాబు మల్టీస్టారర్ ఫిక్స్..
-
మాస్ మల్టీస్టారర్
-
ప్యాడింగ్ కోసం పాకులాడుతున్న మెగాస్టార్ చిరంజీవి..?
-
అలా అయితే రూ.3000 కోట్లు వసూలు చెయ్యొచ్చు: సల్మాన్
‘‘హిందీలో ‘ప్రతిబం«ధ్’ (1990), ‘ఆజ్ కా గూండారాజ్’ (1992), ‘ది జెంటిల్ మేన్’ (1994) వంటి సినిమాలు చేశాను. ఆ తర్వాత తెలుగు సినిమాలతో బిజీ అయి, హిందీ సినిమాలకు దూరంగా ఉన్నాను. ప్రాంతీయ, జాతీయ సినిమాలు అనే తేడాలు పోవాలి. ఏ సినిమా అయినా ఇండియన్ సినిమాయే అనే రోజులు రావాలని కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల నుంది. శనివారం ముంబైలో జరిగిన ఈ సినిమా హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నటించినందుకు నిర్మాతలు సల్మాన్‌కు పారితోషికం ఇవ్వాలనుకున్నప్పుడు ‘చిరంజీవిగారు, రామ్‌చరణ్‌లపై నాకు ఉన్న ప్రేమను ఈ చెక్‌తో వెలకడతారా?’’అని తిరస్కరించారు. ‘గాడ్‌ఫాదర్’ పార్టు 2 ఉండొచ్చు’’ అన్నారు. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ – ‘‘గాడ్‌ఫాదర్’లో ఓ చిన్న రోల్ అన్నారు. చిరంజీవిగారు మీ వెనకాల నిలబడతారు అనగానే ఓకే అన్నాను. ‘గాడ్‌ఫాదర్’ తెలుగులో నా తొలి సినిమా. కొందరు హాలీవుడ్‌కు వెళ్లా లనుకుంటారు. నేను దక్షిణాదికి వెళ్లాలను కుంటున్నాను. నేను మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి రెడీ. ఎందు కంటే మేం సోలో హీరోగా చేస్తే ఆ సినిమా మూడు వందల కోట్లు సాధిస్తోంది. అదే స్టార్స్ కలిసి చేస్తే మూడువేల కోట్లు కూడా సాధించే చాన్స్ ఉంది’’ అన్నారు. -
అల్లు అర్జున్, ధనుష్ హీరోలుగా భారీ మల్టీస్టారర్..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా నడుస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరో క్రేజీ కాంబోకు రంగం సిద్ధమైనట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్, ధనుష్ హీరోలుగా ఓ చిత్రం రానున్నట్టు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమైనట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రం రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత జూ.ఎన్టీఆర్ సినిమాతో బిజీ కానున్నారని సమాచారం. ఇక ఆ చిత్రం పూర్తి చేసిన వెంటనే బన్నీ, ధనుష్ కాంబో మూవీపై కొరటాల శివ దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. -
బాలీవుడ్ టాప్ హీరోతో ప్రభాస్ మల్టీ స్టారర్?
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన రాధే శ్యామ్ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఆదిపురుష్, సలార్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇవే కాక ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందనున్న కొత్త చిత్రం ఈ వేసవిలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీని సైంటిఫిక్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు కొండంత ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా డార్లింగ్‌కు సంబంధించిన మరో కొత్త అప్డేట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ప్రభాస్.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ఓ మల్టిస్టారర్ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలతో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హృతిక్‌తో తలపడేందుకు ప్రభాస్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని, వీరిద్దరి మధ్య భారీ ఫైట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్. వార్, బ్యాంగ్ బ్యాంగ్ ఫేమ్ సిద్ధార్ద్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. ఇక ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే మన టాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాల హవా కొనసాగుతున్నప్పటికీ.. బాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాలు రావడం చాలా అరుదు. ఇక ఇటీవల హృతిక్, టైగర్ ఫ్రాఫ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ వార్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ప్రభాస్, హృతిక్ సినిమాకు బీటౌన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో వేచి చూడాలి. చదవండి: ముంబైలో కొత్తింటి కోసం ప్రభాస్ వెతుకులాట! వైరల్: బ్యాలెన్స్ తప్పిన కృతి.. నెటిజన్ల ట్రోలింగ్! -
మరో మల్టీస్టారర్ చిత్రంలో రానా!
చెన్నై : కోలీవుడ్ ఇటీవలి కాలంలో మల్టీస్టారర్ చిత్రాలపై దృష్టి సారిస్తోందని చెప్పవచ్చు. ఇటీవల మణిరత్నం ‘సెక్క సెవంద వానం’పేరుతో మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మల్టీస్టారర్ చిత్రం ‘పొన్నియన్ సెల్వమ్’భారీగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో జయంరవి, కార్తీ, అమితాబ్‌బచ్చన్, ఐశ్వర్యరాయ్, అనుష్క, కీర్తీసురేశ్, మోహన్‌బాబు ఇలా పలువురు ప్రముఖ నటీనటులు నటించనున్నారు. అదే విధంగా దర్శకుడు పా.రంజిత్ ఇక మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారనేది తాజా సమాచారం. ఈయన ఇంతకు ముందు రజనీకాంత్ హీరోగా కబాలి, కాలా చిత్రాలను తెరకెక్కించి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పా.రంజిత్ హిందీలో ప్రముఖ స్వాతంత్య్ర పోరాటయోధుడు బిర్సా ముండా బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం 2020లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇలాంటిది తాజాగా ఒక మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఆర్య, రానా, సత్యరాజ్‌లు నటించనున్నట్లు సమాచారం. ఇందుకోసం వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇందులో నటించనున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. -
కాంబినేషన్ కుదిరింది
‘అష్టా చమ్మా, జెంటిల్మన్, అమీ తుమీ’ ఇటీవల ‘ సమ్మోహనం’ తదితర చిత్రాల విజయాలతో ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేశారు దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీకి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు నిర్మాత. ఈ సినిమాలో ఒక హీరోగా నాని, మరో హీరోగా సుధీర్‌బాబు నటించనున్నారు. ఇంద్రగంటి ఈ హీరోలిద్దరికీ మంచి అనుబంధం ఉంది. ‘అష్టాచమ్మా, జెంటిల్మన్’ వంటి చిత్రాలతో నానీకి, ‘సమ్మోహనం’తో సుధీర్‌బాబుకి ఇంద్రగంటి హిట్స్ ఇచ్చారు. నాని, సుధీర్లకి మల్టీస్టారర్ మూవీస్ చేయడం కొత్త కాదు. నాగార్జునతో కలిసి నాని ‘దేవదాస్’, సుధీర్‌బాబు ‘శమంతకమణి, వీరభోగ వసంతరాయలు’ వంటి మల్టీస్టారర్స్ చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ కోసం ఇంద్రగంటి ఓ వెరైటీ కథ రెడీ చేశారట. ఈ సినిమాలో నాని క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. -
ఇంద్రగంటి మల్టిస్టారర్ మూవీ!
‘సమ్మోహనం’ సినిమాతో సమ్మర్ ఎండింగ్లో కూల్‌గా హిట్ కొట్టారు దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ. పదునైన మాటలు, హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించారు ఇంద్రగంటి. తన తదుపరి ప్రాజెక్ట్‌గా ఓ మల్టిస్టారర్ మూవీని తెరకెక్కించనున్నారు. ఇంద్రగంటి మల్టిస్టారర్ మూవీని దిల్ రాజు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన హీరోలు, హీరోయిన్లు, తదితర వివరాలను త్వరలో ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం, ఎఫ్2, మహేష్ బాబు- వంశీ పైడిపల్లి సినిమాలను నిర్మిస్తున్నారు. -
జక్కన్న మైండ్‌లో ఇంకొక హీరో?
సాక్షి, సినిమా : టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీస్టారర్‌ను అనధికారికంగా ప్రకటించి.. ప్రేక్షకుల్లో దర్శకుడు రాజమౌళి పెంచిన ఆత్రుత అంతా ఇంతా కాదు. యంగ్ టైగర్-మెగా పవర్ స్టార్ కలయిక అనగానే ఆ వార్త సెన్సేషన్ అయి కూర్చుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి మరో హీరో కూడా వచ్చి చేరబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఈ కమర్షియల్ చిత్రంలో విలన్ పాత్ర కోసం ఓ హీరోను ఎంపిక చేసే ఆలోచనలో జక్కన్న ఉన్నాడంట. ‘‘రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతినాయకుడి పాత్రను కూడా కాస్త బలంగా ఉండేలా చూడాలని తండ్రిని జక్కన్న కోరాడంట. దీంతో విలన్ పాత్రను కూడా పాపులర్ నటుడితోనే చేయించాలన్న నిర్ణయానికి రాజమౌళి వచ్చాడు. అందుకోసం పేర్లును కూడా పరిశీలించటం మొదలుపెట్టేశాడు’’ అన్నది ఆ వార్త సారాంశం. ఏదిఏమైనా ఈ మల్టీస్టారర్‌పై ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయని రాజమౌళి.. ఎన్ని వార్తలు వస్తున్నా అస్సలు స్పందించటం లేదు. గుట్టుచప్పుడు కాకుండా స్క్రిప్ట్ పనులు చేసుకుంటూపోతూ ఏ క్షణంలోనైనా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. -
టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీస్టారర్
టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలు జోరందుకున్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలో విక్టరీ వెంకటేష్‌తో పాటు, నటిస్తున్న వరుణ్ తేజ్ తాజగా మరో మల్టీస్టారర్‌కు అంగీకరించినట్లు సమాచారం. వరుణ్, రానాతో కలిసి మరో మల్టీస్టారర్‌లో నటించడానికి అంగీకరించాడట. ప్రముఖ తమిళ డైరెక్టర్ సాల్మన్ రాజ్ ఈచిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుతున్నాయని, త్వరలోనే ఈచిత్రం సెట్స్‌పైకి వెల్లనుందని సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం రానా ‘1945’ లో నటిస్తున్నాడు. తరువాత ‘హతి మేరే సాతి’ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇక వరుణ్ విషయానికి వస్తే వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తొలిప్రేమ’ షూటింగ్లో బీజీగా ఉన్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మస్తున్నారు. -
టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్?
సాక్షి, సినిమా : వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. రీసెంట్గా గరుడవేగ చిత్ర ఘన విజయం సాధించటంతో అతనితో పని చేసేందుకు యువహీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో తన తర్వాతి చిత్రం ప్రవీణ్‌తో ఉంటుందని స్వయంగా నితిన్ ప్రకటించటం చూశాం. అయితే అది మాములు చిత్రం కాదన్న సంకేతాలు ఇప్పుడు అందుతున్నాయి. ముగ్గురు యువ హీరోలతో ప్రవీణ్ మల్టీస్టారర్ తెరకెక్కించబోతున్నాడని చెబుతున్నాడని ఫిల్మ్ నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘త్రీ కజిన్స్’ టైటిల్ తో ఈ చిత్రం రూపుదిద్దుకోబోతుందని టాక్. నితిన్ ఓ హీరోగా ఇప్పటికే ఎంపిక కాగా, మిగతా ఇద్దరు హీరోలుగా రానా, నారా రోహిత్‌లను తీసుకునే అవకాశం ఉందంట. ఒకవేళ అదే జరిగితే మాత్రం ప్రేక్షకులకు మరో క్రేజీ సినిమా అందినట్లే అవుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ముగ్గురు యువహీరోలు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. -
ఆ ఇద్దరూ 'బెంగళూరు డేస్' కెళ్లారు..
తెలుగులో మరో మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కబోతుంది. అప్పట్లో తాతలు కలిసి నటిస్తే ఇప్పుడు.. మనవళ్లు కలిసి నటించబోతున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, లవర్ బాయ్ నాగ చైతన్య కలిసి నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించబోతుంది. 'బొమ్మరిల్లు'ను ఇంటి పేరుగా మార్చుకున్న భాస్కర్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మలయాళ చిత్రం 'బెంగళూరు డేస్' రీమేక్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా హీరోయిన్స్ ఎవరనేది ఖరారు కాలేదు. కాగా 'బెంగళూరు డేస్' హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. అయితే ఆయన ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమా హక్కులను మరో నిర్మాణ సంస్థకు అప్పగించినా.. దిల్ రాజు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది. గతంలో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా రుపొందబోతున్నదని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. దాంతో 'నాగ్'తో మిస్ అయిన ఛాన్స్...ఇప్పుడు కొడుకుతో భర్తీ అయినట్లు అయింది. కాగా గత ఏడాది కాలంగా నాగార్జున, బాలకృష్ణల మధ్య మాటలు లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అబ్బాయిలు ఇద్దరూ కలిసి నటించటం విశేషం. -
ఇద్దరు సూపర్ స్టార్ల చిత్రం!
మల్టీస్టార్ చిత్రాలంటే మాటలుకాదు. ఇక ఇద్దరు సూపర్‌స్టార్స్ నటిస్తే ఎలా ఉంటుంది? అది ఎంత పెద్ద వార్త. అలాంటి వార్తే ఒక ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రజనీస్టైల్స్ - మహేష్ వైబ్రేషన్స్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించండి. అటువంటి మూవీ వార్త వింటే అభిమానులకు పండగే. ఇప్పుడు ఈ సూపర్ స్టార్లతో భారీ మల్టీస్టారర్ సినిమా గురించే ఇండస్ట్రీలో పుకార్లు షికారు చేస్తున్నాయి. సూపర్‌స్టార్ అనగానే భారతీయ చలనచిత్రరంగంలో చాలామంది మహానటులు గుర్తుకు వస్తారు. కానీ దక్షిణాదిన సూపర్‌స్టార్ అనగానే కనిపించే మొట్టమొదటి బొమ్మ రజనీకాంత్దే. భారతీయ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన హీరో రజనీకాంత్. ఇక టాలీవుడ్లో ఇప్పుడు సూపర్‌స్టార్ అనగానే ప్రిన్స్ మహేష్ బాబు కళ్లముందు కనిపిస్తాడు. తన పేరులో ఉన్న వైబ్రేషన్స్‌ను వెండితెర బాక్సాఫీసుకు పరిచయం చేసిన బిజినెస్మెన్ మహేష్. నాడు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, నేడు కొడుకు మహేష్ ఆ స్థానం ఆక్రమించేశారు. మొత్తానికి టాలీవుడ్లో సూపర్‌స్టార్ అనే పిలుపు ఘట్టమనేని ఫ్యామిలీకి పేటెంట్గా మారిపోయింది. ప్రేక్షకుల ఉత్సాహాన్ని ఉరకలెత్తించే ఎనర్జీ ఒకరిది. అరవైలోనూ ఇరవైని తలదన్నే స్టైల్‌తో మతిపోగొట్టే ఇమేజ్ మరొకరిది. ఇలాంటివాళ్ల సినిమాలు వస్తున్నాయంటేనే ఒక పండగ. అలాంటిది ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే అటువంటి సినిమాను ప్రేక్షకులు వందేళ్ల సినిమా పండక్కి కానుకగా భావిస్తారు. రజనీ, మహేష్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారన్న వార్త అటు కోలివుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ వినవస్తోంది. గతంలో రజనీకాంత్, కృష్ణల కాంబినేషన్లో రెండు చిత్రాలు నిర్మించిన సూర్యనారాయణబాబే ఈ సెన్సేషనల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఇద్దరు సూపర్స్టార్ల నుంచీ ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే నాడు తండ్రి, నేడు కొడుకుతో మల్టీస్టారర్ చేసిన హీరోగా రజనీకాంత్ చరిత్ర సృష్టిస్తారు. ఐతే ఈ భారీ మల్టీస్టారర్‌కు డైరెక్టర్ ఎవరు? అనే ప్రశ్న మొదలైంది. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. గతంలోనే మహేష్, నాగార్జునల కోసం మణిరత్నం ఒక కథ సిద్ధం చేసుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు మణిరత్నం ఈ ఇద్దరు సూపర్ స్టార్లను డైరెక్ట్ చేస్తారన్న టాక్ వినవస్తోంది. తెలుగు, తమిళ రెండు భాషలో సూపర్ స్టార్లతో చిత్రం నిర్మించి హిట్లు కొట్టిన ఘనుడు మణిరత్నం. మణిరత్నంతోపాటు వినిపించే మరో పేరు శంకర్. ఇప్పటికే రజనీతో రెండు సినిమాలు చేసిన శంకర్ ఘన విజయాలు సాధించాడు. హ్యాట్రిక్ కోసం శంకర్ ఈ మల్టీస్టారర్ మూవీని ఎన్నుకునే అవకాశం ఉందని అంటున్నారు. సూపర్ స్టార్లతో సినిమా అంటే ముఖ్యంగా కథ కుదరాలి. అన్ని అవకాశాలు కలసిరావాలి. గతంలో పలువురు హీరోలు కలిసి నటిస్తారని ప్రచారం జరిగింది. చివరికి వచ్చేసరికి ఆ కథలు సెట్ వరకు వెళ్లలేదు. ఇప్పుడు రజనీ, మహేష్ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ** -
రజనీకాంత్, మహేశ్ బాబు.. ఓ మల్టీ స్టారర్!
-
రజనీకాంత్, మహేశ్ బాబు.. ఓ మల్టీ స్టారర్!
సూపర్‌స్టార్స్ రజనీకాంత్, మహేశ్‌బాబు కాంబినేషన్లో సినిమా... గురువారం మధ్యాహ్నం నుంచి మీడియాలో హల్ చల్ చేసిన వార్త ఇది. అసలిది నిజమేనా? అయితే ఎప్పుడు ఉంటుంది? రకరకాల ప్రశ్నలు. వీటన్నిటికీ పాఠకులకు సమాధానం ఇవ్వడం కోసం సీనియర్ నిర్మాత యు. సూర్యనారాయణ బాబుతో మాట్లాడింది ‘సాక్షి’. రామ్ రాబర్ట్ రహీమ్, సంధ్య, శంఖారావం, బజార్ రౌడీ... ఇలా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 20 చిత్రాలు నిర్మించిన సూర్యనారాయణబాబు, స్వయానా సూపర్‌స్టార్ కృష్ణకు చెల్లెలు భర్త. కృష్ణతో ‘అల్లుడు దిద్దిన కాపురం’(1991) తీశాక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారాయన. రజనీకాంత్, మహేశ్‌బాబు తన సినిమాలో కథానాయకులుగా నటించడానికి పచ్చజెండా ఊపేశారని చెబుతున్న సూర్యనారాయణ బాబు ‘సాక్షి’తో ఏమన్నారంటే... రజనీకాంత్‌తో సినిమా అంటే అది వంద కోట్లపై మాట. పైగా మహేశ్ కూడా మరో హీరో అంటున్నారు. ఇది సాధ్యమేనా? రజనీకాంత్ ఇచ్చిన భరోసా ఇది. నేనంటే ఆయనకు అభిమానం. ‘‘ ‘లింగా’ తర్వాత ఇరోస్ సంస్థలో ఓ భారీ ప్రాజెక్ట్ ఉంది. అది కూడా పూర్తయ్యాక మీ సినిమా చేస్తాను’’ అని ఆయనే స్వయంగా నాతో చెప్పారు. నేను ఆయనతో తెలుగులో ‘రామ్ రాబర్ట్ రహీమ్’, ‘అన్నదమ్ముల సవాల్’, హిందీలో ‘మేరా అదాలత్’, ‘మహా గురు’ తీశాను. ఇంతకూ రజనీకాంత్‌ని ఎప్పుడు కలిశారు? తమిళ నిర్మాత కె.సి.ఎన్.చంద్రుగారితో నా గురించి వాకబు చేశారట రజనీ. వెంటనే.. నేను, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో రజనీని కలిశాం. ‘సినిమాలు తీయడంలేదే’ అనడిగారు రజనీ. ‘మీ నిర్మాతను కదా. మీరు ‘ఓకే’ అంటే చేయాలనే ఉంది’ అన్నాను. ఆయన కూడా ఓకే అన్నారు. పైగా ఆయనే ‘అన్నదమ్ముల సవాల్’లా మల్టీస్టారర్ అయితే బావుంటుందని సూచించారు. ‘అన్నదమ్ముల సవాల్’లో కృష్ణ, రజనీకాంత్ నటించారు. మరి మహేశ్‌బాబుకు ఈ విషయం చెప్పారా? చెప్పాను. ‘సూపర్‌స్టార్‌తో చేయడం నాకూ హ్యాపీనే’ అన్నారాయన. ఇద్దరు సూపర్స్టార్లతో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉంది. మీరొక్కరేనా... ఇంకెవరినైనా కలుపుకొని ఈ సినిమా చేస్తారా? నేనొక్కడినే చేస్తాను. 23 ఏళ్ల విరామం తర్వాత చేస్తున్న సినిమా అవ్వడం వల్లే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాను. ఇంత విరామం తర్వాత వచ్చే సినిమా ఈ స్థాయిలోనే ఉండాలనేది నా ఆలోచన. మంచి సినిమాలు నిర్మించిన మీరు ఉన్నట్లుండి సినిమా రంగానికి ఎందుకు దూరమయ్యారు? వ్యాపార రీత్యా విజయవాడలో స్థిరపడ్డాను. సినిమాలపై మమకారంతో మళ్లీ నిర్మాణానికి ఉపక్రమిస్తున్నాను... అంతే. దర్శకుడు, కథ, సాంకేతిక బృందం వివరాలు... రజనీకాంత్, మహేశ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది మొన్నే కదా. ఆ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్టే. త్వరలోనే వివరాలు చెబుతాం. సెట్స్‌కి వెళ్లేదెప్పుడు? వచ్చే ఏడాది చివర్లో కానీ, 2016లో కానీ ఉంటుంది. మా పద్మావతీ ప్రొడక్షన్స్ పతాకంపైనే ఈ చిత్రాన్ని నిర్మిస్తాను. -
మాస్ రాజతో కలిసినటిస్తోన్న వెంకీ..?