
రామ్ చరణ్-ఎన్టీఆర్ (పాత చిత్రం)
సాక్షి, సినిమా : టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్‌ను అనధికారికంగా ప్రకటించి.. ప్రేక్షకుల్లో దర్శకుడు రాజమౌళి పెంచిన ఆత్రుత అంతా ఇంతా కాదు. యంగ్ టైగర్-మెగా పవర్ స్టార్ కలయిక అనగానే ఆ వార్త సెన్సేషన్ అయి కూర్చుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి మరో హీరో కూడా వచ్చి చేరబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది.
ఈ కమర్షియల్ చిత్రంలో విలన్ పాత్ర కోసం ఓ హీరోను ఎంపిక చేసే ఆలోచనలో జక్కన్న ఉన్నాడంట. ‘‘రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతినాయకుడి పాత్రను కూడా కాస్త బలంగా ఉండేలా చూడాలని తండ్రిని జక్కన్న కోరాడంట. దీంతో విలన్ పాత్రను కూడా పాపులర్ నటుడితోనే చేయించాలన్న నిర్ణయానికి రాజమౌళి వచ్చాడు. అందుకోసం పేర్లును కూడా పరిశీలించటం మొదలుపెట్టేశాడు’’ అన్నది ఆ వార్త సారాంశం.
ఏదిఏమైనా ఈ మల్టీస్టారర్‌పై ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయని రాజమౌళి.. ఎన్ని వార్తలు వస్తున్నా అస్సలు స్పందించటం లేదు. గుట్టుచప్పుడు కాకుండా స్క్రిప్ట్ పనులు చేసుకుంటూపోతూ ఏ క్షణంలోనైనా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment