
‘అష్టా చమ్మా, జెంటిల్‌మన్, అమీ తుమీ’ ఇటీవల ‘ సమ్మోహనం’ తదితర చిత్రాల విజయాలతో ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేశారు దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీకి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు నిర్మాత. ఈ సినిమాలో ఒక హీరోగా నాని, మరో హీరోగా సుధీర్‌బాబు నటించనున్నారు.
ఇంద్రగంటి ఈ హీరోలిద్దరికీ మంచి అనుబంధం ఉంది. ‘అష్టాచమ్మా, జెంటిల్‌మన్’ వంటి చిత్రాలతో నానీకి, ‘సమ్మోహనం’తో సుధీర్‌బాబుకి ఇంద్రగంటి హిట్స్ ఇచ్చారు. నాని, సుధీర్‌లకి మల్టీస్టారర్ మూవీస్ చేయడం కొత్త కాదు. నాగార్జునతో కలిసి నాని ‘దేవదాస్’, సుధీర్‌బాబు ‘శమంతకమణి, వీరభోగ వసంతరాయలు’ వంటి మల్టీస్టారర్స్ చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ కోసం ఇంద్రగంటి ఓ వెరైటీ కథ రెడీ చేశారట. ఈ సినిమాలో నాని క్యారెక్టర్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటాయట.
Comments
Please login to add a commentAdd a comment