నేనే నానీనే! | Nani New Movie is V | Sakshi
Sakshi News home page

నేనే నానీనే!

Jan 29 2020 12:02 AM | Updated on Jan 29 2020 12:02 AM

Nani New Movie is V - Sakshi

నాని

‘ఈగ’ సినిమాని అంత సులువుగా మరచిపోలేం. ఈగగా పునర్జన్మ ఎత్తాక నాని పాత్ర తన ప్రేయసి దగ్గర ‘నేనే నానీనే..’ అని తన ఉనికిని చాటడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఇక్కడున్న నాని ఫొటో చూశారుగా! ఇన్నాళ్లూ మంచి అబ్బాయిగా కనిపించిన నానీయేనా ఇలా రౌడీ టైప్‌లో కనిపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఇదే ప్రశ్న నానీని అడిగితే.. ‘అవును.. నేనే నానీనే’ అంటారేమో. ఇప్పటివరకూ మంచి అబ్బాయి పాత్రల్లో కనిపించిన నాని తొలిసారి విలన్‌ తరహా పాత్రలో కనిపించనున్న చిత్రం ‘వి’.

ఈ సినిమాలోని లుక్‌నే మనం చూస్తున్నాం. నాని హీరోగా అష్టాచమ్మా, జెంటిల్‌మన్‌ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ నానీని విలన్‌ని చేశారు.  నాని హీరోగా నేను లోకల్, ఎంసీఎ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన ‘దిల్‌’ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఉగాది సందర్భంగా మార్చి 25న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావు హైదరి తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాతలు: రాజు, శిరీష్, హర్షిత్‌ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement