మరోసారి పోలీస్ పాత్రలో! | Sudheer Babu Clarity On His Role in Multi Starrer Movie With Nani | Sakshi
Sakshi News home page

మరోసారి పోలీస్ పాత్రలో!

Jul 20 2019 10:13 AM | Updated on Jul 20 2019 10:13 AM

Sudheer Babu Clarity On His Role in Multi Starrer Movie With Nani - Sakshi

ఈ జనరేషన్‌ హీరోలు మల్టీస్టారర్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న నాని కూడా ఇటీవల ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సీనియర్‌ హీరో నాగార్జునతో కలిసి దేవదాస్‌ సినిమాలో నటించిన నాని, ప్రస్తుతం సుధీర్‌ బాబుతో కలిసి మరో సినిమా చేస్తున్నాడు.

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వి అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చారు సుధీర్‌ బాబు. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న  సినిమాలో తాను పోలీస్‌ పాత్రలో నటిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే పోలీస్‌ పాత్రలో కనిపించి సుధీర్‌ బాబు మరోసారి అదే లుక్‌లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌లోనూ నటిస్తున్నట్టుగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement