నేచురల్ స్టార్ నాని మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని, తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా ఇప్పటికే ప్రకటించాడు నాని. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు.
మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని ప్రతినాయక పాత్రలో నటించనున్నాడట. మరో యంగ్ హీరో సుధీర్ బాబు పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి నెగెటివ్ రోల్ అయినా కథా కథనాలు నచ్చటంతో నాని ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. అదితిరావ్ హైదరీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది, మణిశర్మ, సంతోష్ నారాయణన్‌లలో ఒకరిని సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment