
‘సమ్మోహనం’ సినిమాతో సమ్మర్ ఎండింగ్‌లో కూల్‌గా హిట్ కొట్టారు దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ. పదునైన మాటలు, హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించారు ఇంద్రగంటి. తన తదుపరి ప్రాజెక్ట్‌గా ఓ మల్టిస్టారర్ మూవీని తెరకెక్కించనున్నారు.
ఇంద్రగంటి మల్టిస్టారర్ మూవీని దిల్ రాజు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన హీరోలు, హీరోయిన్లు, తదితర వివరాలను త్వరలో ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం, ఎఫ్2, మహేష్ బాబు- వంశీ పైడిపల్లి సినిమాలను నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment