Jr NTR 30 Movie: ఎన్టీఆర్‌ ఎఫెక్ట్‌.. బన్నీ సినిమా ఆగిపోయిందా? | Koratala Siva And Allu Arjun Postpone - Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ ఎఫెక్ట్‌.. బన్నీ సినిమా ఆగిపోయిందా?

Published Wed, Apr 14 2021 8:57 AM | Last Updated on Wed, Apr 14 2021 10:58 AM

Koratala Siva NTR New Project Effect on Allu Arjun Next Movie - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ సినిమా రూపొందాల్సింది. జీఏ 2, యువసుధ ఆర్ట్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మించాల్సింది.

కానీ జూనియర్‌ ఎన్టీఆర్‌తో కొరటాల శివ చేయనున్న సినిమా ఎనౌన్స్‌మెంట్‌ సోమవారం వచ్చింది. దీంతో కొరటాల, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో  సినిమా ఆగిందనే టాక్‌ టాలీవుడ్‌లో వినిపించింది.‘‘అల్లు అర్జున్‌ , కొరటాల శివ కాంబినేషన్‌ సినిమా ఆగిపోలేదు. పరస్పర అంగీకారంతోనే ఈ సినిమా వాయిదా వేయడం జరిగింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం’’ అని యువసుధ ఆర్ట్స్‌ ప్రతినిథులు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.  

ఇక కొరటాలను ఎన్టీఆర్‌ లాగేసుకోవడంతో పుష్ప తర్వాత అల్లు అర్జున్‌ గ్యాప్‌ తీసుకుంటాడా లేదా వేరే దర్శకుడితో సినిమా చేస్తారా అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు వకీల్‌ సాబ్‌ డైరెక్టర్‌ వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్‌’ అనే సినిమా తీయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే. 
చదవండి:
NTR 30: ఈసారి లోకల్‌ రిపేరింగ్‌ కాదు.. అంతకు మించి‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement