ఆ డైరెక్టర్‌తో బన్నీ నెక్ట్స్‌ మూవీ | Allu Arjun Announces His Next Movie With Koratala Siva | Sakshi
Sakshi News home page

ఆ డైరెక్టర్‌తో బన్నీ నెక్ట్స్‌ మూవీ

Published Fri, Jul 31 2020 1:48 PM | Last Updated on Fri, Jul 31 2020 2:17 PM

Allu Arjun Announces His Next Movie With Koratala Siva - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై ప్రకటన వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ తన 21వ చిత్రం చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. ‘నా తదుపరి చిత్రం కొరటాల శివ గారితో ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. కొంతకాలంగా నేను దీని కోసమే ఎదురుచూస్తున్నాను. సుధాకర్‌ గారి మొదటి ప్రాజెక్టుకు నా శుభాకంక్షలు. శాండి, స్వాతి, నట్టి ఇది మీ పట్ల నాకున్న ప్రేమను చూపించే మార్గం. కాగా, ఈ చిత్రంతో సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. యువ సుధా ఆర్ట్స్‌, జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శాండీ, స్వాతి, నట్టీలు సహా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. (దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే రోజా)

కాగా, ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న బన్నీ 20వ సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌కు విశేషమైన స్పందన వచ్చింది.  ఈ చిత్రాన్ని తెలుగుతోపాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. మరోవైపు గతంలోనే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. ఆ తర్వాత ఇప్పటివరకు షూటింగ్‌ ప్రారంభం గురించి చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.(క్రేజీ డైరెక్టర్‌తో బాలయ్య తదుపరి చిత్రం!)

ఇక, బన్నీ-వేణు శ్రీరామ్‌ కాంబినేషన్‌లో దిల్‌ రాజు నిర్మాతగా ‘ఐకాన్‌-కనబడుటలేదు’ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. బన్నీ కేరీర్‌లో 21వ చిత్రంగా ఇది తెరకెక్కనున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఈ చిత్రం గురించి టాక్‌ వినిపించలేదు. అయితే ఈ ఏడాది బన్నీ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. ఆయనకు విషెస్‌ చెబుతూ ఐకాన్‌ టీమ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే తాజాగా కొరటాల సినిమాకు బన్నీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఐకాన్‌ మూవీ మరింత ఆలస్యం కానున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కొరటాల శివ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఆచార్య మూవీని తెరకెక్కిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement