Nithiin next with Vakkantham Vamsi titled as EXTRA - Sakshi
Sakshi News home page

ఇదీ 'కిక్‌' సినిమాకు డబుల్‌ 'ఎక్స్‌ట్రా' : వక్కంతం వంశీ

Published Mon, Jul 24 2023 5:21 AM | Last Updated on Mon, Jul 24 2023 10:26 AM

Nithiin, Vakkantham Vamsi Film titled as EXTRA - Sakshi

నితిన్  హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘ఎక్స్‌ట్రా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘ఆర్డినరీ మేన్ ’ అనేది ట్యాగ్‌లైన్ . ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్, ఆదిత్యా మూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 23న విడుదల కానుంది.

తాజాగా ఆదివారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్, రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. ‘‘కిక్‌’ సినిమా తర్వాత ఆ రేంజ్‌లో క్యారెక్టర్‌ బేస్డ్‌ స్క్రిప్ట్‌తో ‘ఎక్స్‌ ట్రా’ సినిమా తెరకెక్కుతోంది. ఆడియన్స్‌ రోలర్‌ కోస్టర్‌ లాంటి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తూనే, నవ్విస్తూ సర్‌ప్రైజ్‌లతో మెప్పిస్తుంది మా సినిమా’’ అన్నారు వక్కంతం వంశీ. ఈ సినిమాకు సంగీతం: హారిస్‌ జైరాజ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement