నవల రూపంలో ఎన్టీఆర్ సినిమా | Ntr, Puri Jagannadh Temper Turns Novel | Sakshi

నవల రూపంలో ఎన్టీఆర్ సినిమా

Published Sun, Apr 2 2017 3:14 PM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

నవల రూపంలో ఎన్టీఆర్ సినిమా

నవల రూపంలో ఎన్టీఆర్ సినిమా

రెగ్యులర్గా మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రూట్ మార్చి చేసిన తొలి చిత్రం టెంపర్. ఎప్పుడు తన సొంత కథలతోనే సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఫస్ట్ టైం ఈ సినిమా కోసం వక్కంతం వంశీ దగ్గర కథ తీసుకున్నాడు. ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్గా నటించిన టెంపర్ ఘనవిజయం సాధించటంతో పాటు ఎన్టీఆర్ను అభిమానులకు మరింత చేరువ చేసింది.

ఇప్పుడు ఈ సినిమాకు కథను మరింత మంది పాఠకులకు అందించనున్నాడు రచయిత వక్కంతం వంశీ. ఇప్పటికే తమిళ, హిందీ భాషల్లో రీమేక్కు రెడీ అవుతున్న ఈ సినిమా కథను ఇంగ్లీష్ నవలగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆరు నెలలకు పైగా కష్టపడి వంశీ నవలను సిద్ధం చేశాడు. అయితే ఈ నవలలో క్లైమాక్స్ను సినిమాకు భిన్నంగా  రాశాడట. ప్రస్తుతానికి ఆ క్లైమాక్స్ ఏంటన్నది మాత్రం సస్పెన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement