Hero Nithin, Sreeleela New Movie Opening Pooja Ceremony at Hyderabad - Sakshi
Sakshi News home page

Nithin: కొత్త సినిమా ప్రారంభించిన నితిన్‌, హీరోయిన్‌ ఎవరంటే..

Published Sun, Apr 3 2022 3:49 PM | Last Updated on Sun, Apr 3 2022 5:02 PM

Nithin Launch His New Movie With Director Vakkantham Vamsi - Sakshi

యంగ్‌ హీరో నితిన్‌ వరస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న మాచెర్ల నియోజకవర్గం ఇంకా సట్స్‌పైనే ఉంది. ఈ నేపథ్యంలో నితిన్‌ మరో కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చాడు. దర్శకుడు వక్కంతం వంశీ డైరెక్షన్‌లో  నితిన్‌ ఓ కొత్త సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. ఆదివారం(ఏప్రిల్‌ 3) ఈ సినిమా పూజ కార్యక్రమాన్ని జరుపుకోగా.. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత పి. రామ్మోహన్‌రావు క్లాప్‌ కొట్టారు. ఇందులో నితిన్‌కు జోడిగా ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీలా నటిస్తోంది. ఆదిత్యా మ్యూజిక్‌ ఉమేశ్‌ గుప్తా కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ప్రొడక్షన్‌ నెంబర్‌ 9 పేరుతో ప్రారంభమైన ఈ సినిమా  రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement