బన్నీ ద్విభాషా చిత్రం మొదలవుతోంది..! | Allu Arjun, Lingusamy project to start rolling from Next Summer | Sakshi
Sakshi News home page

బన్నీ ద్విభాషా చిత్రం మొదలవుతోంది..!

Published Sat, Oct 14 2017 10:48 AM | Last Updated on Sat, Oct 14 2017 12:30 PM

Allu arjun Lingusamy

కొద్ది రోజుల క్రితం బన్నీ ఓ స్ట్రయిట్ తమిళ సినిమాను ఎనౌన్స్ చేశాడు. తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై త్వరలోనే సినిమా ప్రారంభిస్తామని చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎనౌన్స్ చేశారు. అయితే తరువాత ఈ ప్రాజెక్ట్ పక్కకెళ్లిపోయింది. బన్నీ, వక్కంత వంశీ దర్శకత్వంలో సినిమా ప్రారంభిస్తే లింగుసామి.. విశాల్ హీరోగా పందెంకోడి సీక్వల్ ను తెరకెక్కిస్తున్నాడు.

తాజాగా మరోసారి బన్నీ కోలీవుడ్ ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ, లింగుసామిల ప్రాజెక్ట్ ఆగిపోలేదని త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న ఈ సినిమాను 2018 వేసవిలో మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మలయాళ మార్కెట్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా పాగా వేస్తాడేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement