నాన్నకు ప్రేమతో సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, ఆ తరువాత చేయబోయే సినిమా విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు. శుక్రవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బుడ్డోడు చేయబోయే నెక్ట్స్ సినిమా పోస్టర్ రిలీజ్ అయ్యింది. చాలా రోజులుగా వక్కంత వంశీ డైరెక్షన్లో సినిమా చేయనున్నట్టుగా చెపుతున్న ఎన్టీఆర్ తన 27వ సినిమా వంశీ డైరెక్షన్ లో నటించడానికి అంగీకరించాడు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో 9వ సినిమాగా హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలకు కథా రచయితగా వ్యవహరించిన వక్కంతం వంశీ, ఎన్టీఆర్తో చేయబోయే సినిమా కోసం ఓ పవర్ ఫుల్ కమర్షియల్ సబ్జెక్ట్ రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. జనతా గ్యారేజ్ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, ఆ తరువాత వెంటనే వక్కంతం వంశీ దర్శకత్వంలో కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Happy Birthday nanna @tarak9999 #NTR27 pic.twitter.com/XPwdnFO0Xw
— KALYANRAM NANDAMURI (@NANDAMURIKALYAN) 19 May 2016