
వంశీ సినిమా బన్నీతోనా..?
టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథా రచయితగా మంచి పేరు తెచ్చుకున్న రైటర్ వక్కంతం వంశీ ఇప్పుడు దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే కథ రెడీ చేసుకున్న ఈ స్టార్ రైటర్, తన అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిస్తారంటూ పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి.
అయితే తాజాగా జనతా గ్యారేజ్ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాని.. ఆ తరువాతే నెక్ట్స్ ప్రాజెక్ట్ను ఫైనల్ చేస్తానని తెలిపాడు. దీంతో వక్కంతం వంశీ ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ పునరాలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే చాలా కాలంగా ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్న వంశీ కూడా తన సొంతం ప్రయత్నాల్లో ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ఎటూ తేల్చని నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోగా సినిమా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించిన బన్నీతో సినిమా మొదలు పెట్టాలన్నా సమ్మర్ వరకు ఆగాల్సిందే. మరి వంశీ సినిమా ఎవరితో మొదలవుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.