సాక్షి, సినిమా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిపబ్లిక్ డే కానుక ఇచ్చేశాడు. తన తదుపరి చిత్రం నా పేరు సూర్య నుంచి మొదటి పాటను విడుదల చేసేశాడు. దేశ రక్షణ కోసం అహర్నిశలు పాటుపడుతున్నా సైనికులకు కోసం ’సైనిక‘ పాటను అంకితమిచ్చేశాడు.
గణతంత్ర్య దినోత్సవ సందర్భంగా అందరికీ విషెస్ చెబుతూ బన్నీ ఈ పాటను విడుదల చేశాడు. ‘సరిహద్దులో నువ్వు లేకుంటే.. కనుపాప.. కంటి నిండుగా నిదుర పోదురా.. నిదుర పోదురా.... అంటూ రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం బాగుంది. విశాల్-శేఖర్ సమకూర్చిన రాకింగ్ మ్యూజిక్‌కు విశాల్ దడ్లానీ గాత్రం సరిపోయింది. భావోద్వేగంగా ఉన్న ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్ర ఆల్బమ్ విడుదలయ్యింది.
వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక కాగా, యాక్షన్ కింగ్ అర్జున్, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సమ్మర్‌లో నా పేరు సూర్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment