first song release
-
నిన్నిట్టా సూత్తుంటే..
‘నిన్నిట్టా సూత్తుంటే ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్ల.. ఎత్తుకెల్లిపోవాలనిపిస్తుందే..’ అంటూ హీరోయిన్ ఆషికా రంగనాథ్‌ని చూసి పాడేస్తున్నారు హీరో నాగార్జున. విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా నటిస్తున్న ‘నా సామి రంగ’ చిత్రంలోని పాట ఇది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్ల...’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేశారు మేకర్స్. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, రామ్ మిరియాల పాడారు. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ‘నా సామి రంగ’. ఈ సినిమాలో నాగార్జున ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ‘ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్ల..’ పాటలో నాగార్జున, ఆషిక కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటుంది. నాగార్జున హ్యాండ్సమ్ లుక్స్, ఆషిక ట్రెడిషనల్ గెటప్ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతికి విడుదల కానున్న మా సినిమా కుటుంబంతో కలిసి చూసేలా ఉంటుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. -
పొన్నియన్ సెల్వన్ నుంచి ఫస్ట్‌సాంగ్ అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1’. పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 30న ఈ మూవీ ఐదు(తెలుగు,తమిళం, మలయాళం, హిందీ, కన్నడ) భాషల్లో విడుదల కానుంది. మూవీ ప్రమోషన్లను వేగవంత చేసిన చిత్ర బృందం ఇప్పటికే ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేయగా.. వీటికి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. చదవండి: సినిమా రిలీజ్ కాదన్నారు.. వారం క్రితం ఏడ్చేశాను: నిఖిల్ ‘పొంగే నది పాడినది’ అంటూ సాగే ఈ పాట సింగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను ఏఆర్ రెహమాన్, ఏఆర్ రైహానా, బాంబా బక్యా ఆలపించారు. కాగా ఈ సినిమాకు ఏఆర్ రహామాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. కాగా మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్‌పై సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
ఇంకేం కావాలే!
విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గీత గోవిందం’. జీఏ2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్ని’ వాసు నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘ఇంకేం ఇంకేం కావాలే’ ని రిలీజ్ చేశారు. గోపీ సుందర్ మ్యూజిక్‌లో సిడ్ శ్రీరామ్ ఈ సాంగ్‌ను పాడారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ పాట రిలీజ్ చేసిన రెండు రోజుల్లోనే యూట్యూబ్‌లో రెండు మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా – ‘‘మా సినిమాలోని ఫస్ట్ మెలోడీ సాంగ్ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇదొక్క పాటే కాదు ఆల్బమ్‌లోని ప్రతి పాట ఇంతే అద్భుతంగా ఉండబోతోంది. సినిమాలో పాటలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఆగస్ట్ 15న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు చిత్రబృందం. -
బన్నీ అంకితమిచ్చేశాడు
సాక్షి, సినిమా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిపబ్లిక్ డే కానుక ఇచ్చేశాడు. తన తదుపరి చిత్రం నా పేరు సూర్య నుంచి మొదటి పాటను విడుదల చేసేశాడు. దేశ రక్షణ కోసం అహర్నిశలు పాటుపడుతున్నా సైనికులకు కోసం ’సైనిక‘ పాటను అంకితమిచ్చేశాడు. గణతంత్ర్య దినోత్సవ సందర్భంగా అందరికీ విషెస్ చెబుతూ బన్నీ ఈ పాటను విడుదల చేశాడు. ‘సరిహద్దులో నువ్వు లేకుంటే.. కనుపాప.. కంటి నిండుగా నిదుర పోదురా.. నిదుర పోదురా.... అంటూ రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం బాగుంది. విశాల్-శేఖర్ సమకూర్చిన రాకింగ్ మ్యూజిక్కు విశాల్ దడ్లానీ గాత్రం సరిపోయింది. భావోద్వేగంగా ఉన్న ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్ర ఆల్బమ్ విడుదలయ్యింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక కాగా, యాక్షన్ కింగ్ అర్జున్, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సమ్మర్లో నా పేరు సూర్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. -
అల్లు అర్జున్ రిపబ్లిక్ డే కానుక
-
సచిన్ సినిమా పాట వచ్చేసింది
-
సచిన్ సినిమా పాట వచ్చేసింది
ముంబై: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 44వ బర్త్ డే సందర్భంగా సోమవారం బయోపిక్ 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్'లోని తొలిపాటను విడుదల చేశారు. 'హింద్ మేరే జింద్' అనే ఈ పాటకు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూర్చాడు. సచిన్ జీవితకథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వంలో నిర్మాత రవి భగ్చంద్కా ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాను వచ్చే నెల 26న విడుదలకానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. విడుదలైన 12 గంటల సమయంలోనే ఏకంగా 48 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో సచిన్ బాల్యం, క్రికెట్ కెరీర్, వ్యక్తిగత జీవితం, ముఖ్య ఘట్టాల గురించిన సన్నివేశాలుంటాయి. 1983లో కపిల్ దేవ్ ప్రపంచ కప్ అందుకునే దృశ్యాలను పదేళ్ల సచిన్ టీవీలో చూసే సన్నివేశం నుంచి ఓ రోజు అతనే ప్రపంచ కప్‌ను అందుకునే వరకు ముఖ్య ఘట్టాలను ఈ సినిమాగా చిత్రీకరించారు. ఇంతకుముందు ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ సినిమా వచ్చినా, అందులో ధోనీ నేరుగా నటించలేదు. ఈ సినిమాలో మాత్రం సచిన్ టెండూల్కరే స్వయంగా కనిపించడంతో ఇది మరింత ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.