Naa Peru Surya
-
ఎన్టీఆర్‌తో గొడవలు లేవు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘నాపేరు సూర్య’ సినిమాతో దర్శకుడిగా వంశీ పరిచయం అయ్యాడు. వక్కంతం వంశీ ‘కిక్’, ‘టెంపర్’, ‘ఎవడు’ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా పనిచేశాడు. అల్లు అర్జున్ కంటే ముందు వంశీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో డైరెక్టర్‌గా మారాలనుకున్నాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ కోసం కథ కూడా సిద్ధం చేశాడు వక్కంతం వంశీ. కొన్ని చర్చలు జరిగిన తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి జూనియర్ ఎన్టీఆర్ తప్పుకున్నాడు. గతంలో ఎన్టీఆర్, వంశీల మధ్య విబేధాలు వచ్చాయినే వార్తలు హల్చల్ చేశాయి. వంశీ ప్రస్తుతం ఆ విషయంపై స్పందించాడు. ఎన్టీఆర్‌తో తనకు ఏ విధమైన వివాదాలు లేవని, ఆయనతో టచ్‌లో ఉన్నానని చెప్పాడు. ‘ ఎన్టీఆర్‌తో గొడవలు ఉన్నాయని వచ్చిన రూమర్స్ నిజం కాదు. డైరెక్టర్‌గా చేయమని ఎన్టీఆర్ నన్ను ప్రోత్సహించాడు. నా మొదటి చిత్రం ఆయనతోనే చేయాలని అనుకున్నాను. స్టోరి కూడా రెడీ చేశాను. కానీ ఆ ప్రాజెక్టును ఆపేశాం. ఆ సమయంలో బన్నీ కోసం ఓ కథ ఉంటే చెప్పమని బుజ్జి గారు అడిగారు. అప్పుడు ‘నా పేరు సూర్య’ కథ సిద్ధం చేశాను’ అని వక్కంతం వంశీ తెలిపాడు. -
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ రివ్యూ
టైటిల్ : నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : అల్లు అర్జున్, అను ఇమ్మాన్యూయేల్, అర్జున్, శరత్ కుమార్, బొమన్ ఇరానీ, రావూ రమేష్ సంగీతం : విశాల్ - శేఖర్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు, దర్శకత్వం : వక్కంతం వంశీ నిర్మాత : లగడపాటి శ్రీధర్, నాగబాబు, బన్నీ వాసు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ మేకోవర్‌లో.. డిఫరెంట్ మేనరిజమ్స్‌తో సోల్జర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేశాయి. మరి ఆ అంచనాలను నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అందుకుందా.? వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న బన్నీ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడా..? ఎన్నో విజయవంతమైన కథలు అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో విజయం సాధించాడా..? కథ; సూర్య (అల్లు అర్జున్) కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని యువకుడు. తన ఆవేశంతో ప్రతీ ఒకరితో గొడవపడుతూ ఉంటాడు. చిన్నతనంలో ఓ గొడవ కారణంగా ఇంట్లోంచి వెళ్లిపోతాడు. పెద్దయ్యాక సైన్యంలో చేరి అక్కడా తన తీరును మార్చుకోడు. ఈ క్రమంలో ఓ మినిస్టర్ కొడుకుతో గొడవపడటం, తరువాత ఆర్మీ నిర్భందంలో ఉన్న ఓ వ్యక్తిని చంపటంతో ఉన్నతాధికారులు సూర్య మీద చర్యలు తీసుకుంటారు. (సాక్షి రివ్యూస్) తన మీద తనకు కంట్రోల్ లేని వాడు సైన్యంలో పనికిరాడంటూ ఆర్మీ నుంచి సస్పెండ్ చేస్తారు. తిరిగి ఆర్మీలో చేరాలంటే తాను మానసికంగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రముఖ సైకాలజిస్ట్ రామకృష్ణం రాజు (అర్జున్) నుంచి సర్టిఫికేట్ తీసుకురావాలని కండిషన్ పెడతారు. ఆ పని మీద వైజాగ్ వచ్చిన సూర్యకు సమస్యలు ఎదురవుతుంటాయి. చల్లాతో గొడవలు పెట్టుకుంటాడు. ఇంతకీ రామకృష్ణంకు సూర్యకు మధ్య సంబంధం ఏంటి..? సూర్య తన క్యారెక్టర్ని వదులుకొని తిరిగి ఆర్మీలో చేరాడా? అన్నదే మిగతా కథ. నటీనటులు ; అల్లు అర్జున్ గతంలో ఎన్నడూ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించాడు. యాంగ్రీ యంగ్‌మెన్‌గా మంచి నటన కనబరిచాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని యువకుడిగా.. అదే సమయంలో దేశం కోసం ప్రాణమిచ్చే దేశ భక్తుడి షేడ్స్‌లో ఆకట్టుకున్నాడు. రొమాంటిక్ సీన్స్ లోనూ తన మార్క్ చూపించాడు. బన్నీ స్టైలిష్ డాన్స్ మూమెంట్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. యాక్షన్ సీన్స్‌లోనూ బన్నీ పడిన కష్టం తెర మీద కనిపించింది. (సాక్షి రివ్యూస్)హీరోయిన్గా వర్ష పాత్రలో అనూ ఇమ్మాన్యూల్ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఉన్నంతలో నటనతో పాటు గ్లామర్ షోతోనూ అలరించింది. రామకృష్ణంరాజు పాత్రలో నటించిన సీనియర్ నటుడు అర్జున్ సెటిల్డ్ ఫెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. స్టైలిష్‌గా కనిపించిన అర్జున్ తన పాత్రలో ఒదిగిపోయారు. శరత్ కుమార్ తనకు అలవాటైన ఎగ్రెసివ్ రోల్ లో మరోసారి మెప్పించాడు. మరో విలన్ అనూప్ థాకూర్ సింగ్ యాక్షన్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో నదియా, బొమన్ ఇరాని, వెన్నెల కిశోర్, రావూ రమేష్, పోసాని కృష్ణమురళీ, ప్రదీప్ రావత్‌లు తమ పరిధి మేర మెప్పించారు. విశ్లేషణ ; సూపర్ హిట్ కథలు అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను అభిమానులకు డిఫరెంట్ మేకోవర్‌లో చూపించాడు. లుక్ పరంగానే కాదు బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ ఇలా ప్రతీ విషయంలోనూ బన్నీని కొత్తగా చూపించాడు దర్శకుడు. మొదటి నుంచి సినిమాను దేశభక్తి సినిమాగా ప్రమోట్ చేసినా రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. (సాక్షి రివ్యూస్)అయితే తొలి భాగాన్ని ఆసక్తికరంగా నడిపించిన వంశీ, ద్వితీయార్థంలో మాత్రం కాస్త తడబడ్డాడు. సెకండ్ హాఫ్ కథనం కాస్త నెమ్మదించటం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. ప్రేమకథను కూడా అంత ఆసక్తికరంగా మలచలేదు. క్లైమాక్స్ విషయంలోనూ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్లు బన్నీ ఎనర్జీకి తగ్గ ట్యూన్స్ తో అలరించారు. మాస్ ఐటమ్ నంబర్, రొమాంటిక్ మెలోడి, ఫ్యామిలీ సాంగ్ ఇలా అన్ని వేరియేషన్స్ లోనూ ఆకట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయిని మరింత పెంచారు. వంశీ రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. రాజీవ్ రవి సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. ఆర్మీ సీన్స్ తో పాటు ఇతర సన్నివేశాలను అద్భుతంగా కెమెరాలో బంధించాడు రాజీవ్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. సరిహద్దులో శత్రువుల కంటే.. దేశం లోపల ఉన్న దుష్టశక్తులు ప్రమాదకరమని భావించి వాటితో పోరాటం చేసే ఆవేశపరుడైన సైనికుడి కథే ఇది. అయితే తొలి ప్రయత్నంలో బలమైన కథను రాసుకున్న దర్శకుడు వక్కంతం వంశీ.. దానిని తెరపై మాత్రం అంత ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ప్లస్ పాయింట్స్ ; అల్లు అర్జున్ నటన యాక్షన్ సీన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ ; సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్లు స్క్రీన్‌ప్లే క్లైమాక్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
నా పేరు సూర్య ఆడియో ఫంక్షన్ హైలైట్స్
-
'నా పేరు సూర్య' ప్రీ రిలీజ్ వేడుకకు స్టార్ హీరో
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో ఇప్పుడు ట్రెండ్ మారింది. గతంలో ఓ స్టార్ హీరో ఆడియో ఫంక్షన్లకు మరో స్టార్ హీరో వచ్చే పరిస్థితులు లేవు. అంతే కాదు అభిమాన సంఘాల మధ్య సైతం విపరీతమైన వైరం ఉండేది. ఇక సోషల్ మీడియాలో అయితే ఫ్యాన్ వార్‌కు హద్దు లేదు. అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా వెనుకాడం అంటూ పోస్టులు చేసేవాళ్లు. గత కొంతకాలం నుంచి పరిస్థితిలో ఏంతో మార్పు వచ్చింది. టాలీవుడ్ హీరోలు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. వేరే హీరో ఆడియో వేడుకలకు, పార్టీలకు, ప్రీరిలీజ్ ఫంక్షన్లకు హాజరవుతున్నారు. దీనిపై టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగానే గతంలో త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల జరిగిన మరో ఆసక్తికర సన్నివేశం జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఆడియో వేడుకకు తారక్ హజరై తామంతా ఒకటేనంటూ తేల్చేశారు. ఇకనైనా ఫ్యాన్ వార్ ఆపాలంటూ సూచించారు. ఇప్పడు ఇదే కోవలో మరో వేడుక జరగనుందంటూ టాలీవుడ్లో టాక్ మొదలైంది. అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ప్రీ రిలీజ్ వేడుకకు రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్‌గా రానున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై చిత్ర యూనిట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏదేమైనా హీరోలు ఇలా మరో హీరో ఈవెంట్లకు వెళ్తూ ఫ్యాన్స్ వార్‌కు ఫుల్స్టాప్ పెట్టాలన్న యత్నంపై హర్షం వ్యక్తమవుతోంది. -
బన్నీ మళ్లీ దొరికిపోయాడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ సోషల్ మీడియాలో అడ్డంగా దొరికిపోయాడు. మొన్నీ మధ్యే మోదీ తనకు ఇన్సిపిరేషన్ అంటూ బన్నీ ఇచ్చిన స్టేట్ మెంట్ వైరల్ అయి దుమారం రేపింది. ఇప్పుడు కొత్త చిత్రం నా పేరు సూర్య డైలాగ్ ఇంపాక్ట్ మూలంగా బన్నీని సోషల్ మీడియాలో నిర్దాక్షిణ్యంగా ట్రోల్ చేసి పడేస్తున్నారు. ‘సౌత్ ఇండియా.. నార్త్ ఇండియా.. ఈస్ట్.. వెస్ట్.. అన్ని ఇండియాలు లేవురా మనకి ఒక్కటే ఇండియా’ అంటూ డైలాగ్ చెబుతాడు. అయితే అల్లు అర్జున్ అఫీషియల్ ట్విటర్ ప్రొఫైల్ లో మాత్రం "సౌత్ ఇండియన్ యాక్టర్'' అని ఉండటం గమనించిన కొందరు.. దేశభక్తి డైలాగుల వరకేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు.. రీల్ స్టార్సే తప్ప రియల్ స్టార్స్ కాదంటూ... ట్వీట్లు చేస్తూ బన్నీని ఏకేస్తున్నారు. ఇక యాంటీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆ సంగతి పక్కన పెడితే వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన "నా పేరు సూర్య చిత్రంలో అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్ కాగా, అర్జున్, బొమన్ ఇరానీ, రాధిక శరత్ కుమార్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. మే 4న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
బన్నీ.. అసలు కహానీ ఏంటి?
స్కూల్‌కి వెళ్తున్న పిల్లలు, ఆఫీసులకు పరిగెడుతున్న పెద్దలు.. ఇలా ఎవరి పనుల్లో వాళ్లు హడావిడిగా ఉన్న జనాలతో ఆ ఏరియా అంతా సందడిగా ఉంది. కానీ కొద్ది నిమిషాల్లోనే ఆ ఏరియా అంతా గందరగోళంగా తయారైంది. జనాలందరూ భయంతో వణికిపోయారు. కర్ఫ్యూ విధించారు. దీనంతటికీ కారణం అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరగడమే. అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు సూర్య. పరిస్థితులను చూసి రగిలిపోయాడు. అప్పుడు సూర్య ఏం చేశాడు? బాంబ్ బ్లాస్ట్ వెనక ఉన్న కహానీ ఏంటీ? అన్న విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’. ఈ సినిమాలో ఉన్న హైలైట్ సీన్స్‌లో ఈ బాంబ్ బ్లాస్ట్ సీన్ ఒకటి అని సమాచారం. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ చిత్రంలో సోల్జర్ సూర్య పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
బన్నీ అంకితమిచ్చేశాడు
సాక్షి, సినిమా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిపబ్లిక్ డే కానుక ఇచ్చేశాడు. తన తదుపరి చిత్రం నా పేరు సూర్య నుంచి మొదటి పాటను విడుదల చేసేశాడు. దేశ రక్షణ కోసం అహర్నిశలు పాటుపడుతున్నా సైనికులకు కోసం ’సైనిక‘ పాటను అంకితమిచ్చేశాడు. గణతంత్ర్య దినోత్సవ సందర్భంగా అందరికీ విషెస్ చెబుతూ బన్నీ ఈ పాటను విడుదల చేశాడు. ‘సరిహద్దులో నువ్వు లేకుంటే.. కనుపాప.. కంటి నిండుగా నిదుర పోదురా.. నిదుర పోదురా.... అంటూ రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం బాగుంది. విశాల్-శేఖర్ సమకూర్చిన రాకింగ్ మ్యూజిక్కు విశాల్ దడ్లానీ గాత్రం సరిపోయింది. భావోద్వేగంగా ఉన్న ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్ర ఆల్బమ్ విడుదలయ్యింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక కాగా, యాక్షన్ కింగ్ అర్జున్, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సమ్మర్లో నా పేరు సూర్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. -
అల్లు అర్జున్ రిపబ్లిక్ డే కానుక
-
మాట నిలబెట్టుకున్న బన్నీ
అల్లు అర్జున్ మాంచి జోరు మీదున్నారు. ‘రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు’.. ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్స్ సాధించి, ఈ 23న ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’గా రానున్నారు. అలాగే, కొత్త సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సెట్స్‌లోకి ఎంటర్ కావడానికి రెడీ అయిపోయారు. బుధవారం ఈ చిత్రం ప్రారంభమైంది. ‘కిక్, రేసుగుర్రం, టెంపర్’ వంటి హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మెగా బ్రదర్ కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, తల్లి నిర్మల క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ అందించారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘మేం ‘సై్టల్’ సినిమా తీసిన టైమ్‌లో మాతో ఓ సినిమా చేస్తానని అల్లు అర్జున్ మాట ఇచ్చారు. ఆ మాట గుర్తు పెట్టుకొని ఈ చిత్రం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాగబాబు, బన్నీవాసు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తున్నందుకు వెరీ హ్యాపీ. జులైలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాం’’ అన్నారు. ‘యాక్షన్ కింగ్’ అర్జున్ ముఖ్య పాత్రలో, శరత్ కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్ రవి, సంగీతం: విశాల్–శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు, సహ నిర్మాత: బన్నీ వాసు. -
బన్నీతో బెంగళూరు బ్యూటీ?
‘హలో... హలో... మైక్ టెస్టింగ్!’ అనే పదాలు వినిపిస్తే... భారీ కార్యక్రమం ప్రారంభానికి ముందు సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసుకుంటున్నారని అర్థం. ‘హలో మేడమ్... ఫేసు రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి! లెఫ్ట్ టర్న్ ప్లీజ్!’ అనే పదాలు సినిమా షూటింగ్‌కి ముందు వినిపిస్తే... హీరో హీరోయిన్ల జోడీ ఎలా ఉంది? కెమిస్ట్రీ ఎలా ఉంది? అనేవి చెక్ చేస్తున్నారని మీనింగ్ అట! అల్లు అర్జున్ హీరోగా నటించనున్న ‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్న రచయిత వక్కంతం వంశీ ఈ చెకింగ్స్తో బిజీగా ఉన్నారు. బన్నీకి జోడీగా ఎవరు బాగుంటారు? స్క్రీన్‌పై ఎవరితో కెమిస్ట్రీ కుదురుతుంది అనేవి చూస్తున్నారు. ఈ స్క్రీన్ టెస్టుల్లో బెంగళూరు బ్యూటీ రష్మికా మందన ఆల్మోస్ట్ సెలక్ట్ అయినట్టు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. కన్నడ హిట్ ‘కిరిక్ పార్టీ’తో మంచి పేరు తెచ్చుకున్న రష్మిక తెలుగులో అల్లు అర్జున్ సినిమాతో ఎంట్రీ ఇస్తారా? వెయిట్ అండ్ సీ!