
స్కూల్‌కి వెళ్తున్న పిల్లలు, ఆఫీసులకు పరిగెడుతున్న పెద్దలు.. ఇలా ఎవరి పనుల్లో వాళ్లు హడావిడిగా ఉన్న జనాలతో ఆ ఏరియా అంతా సందడిగా ఉంది. కానీ కొద్ది నిమిషాల్లోనే ఆ ఏరియా అంతా గందరగోళంగా తయారైంది. జనాలందరూ భయంతో వణికిపోయారు. కర్ఫ్యూ విధించారు. దీనంతటికీ కారణం అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరగడమే. అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు సూర్య. పరిస్థితులను చూసి రగిలిపోయాడు. అప్పుడు సూర్య ఏం చేశాడు? బాంబ్ బ్లాస్ట్ వెనక ఉన్న కహానీ ఏంటీ? అన్న విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’. ఈ సినిమాలో ఉన్న హైలైట్ సీన్స్‌లో ఈ బాంబ్ బ్లాస్ట్ సీన్ ఒకటి అని సమాచారం. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ చిత్రంలో సోల్జర్ సూర్య పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment