
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌లో ఇప్పుడు ట్రెండ్ మారింది. గతంలో ఓ స్టార్ హీరో ఆడియో ఫంక్షన్లకు మరో స్టార్ హీరో వచ్చే పరిస్థితులు లేవు. అంతే కాదు అభిమాన సంఘాల మధ్య సైతం విపరీతమైన వైరం ఉండేది. ఇక సోషల్ మీడియాలో అయితే ఫ్యాన్ వార్‌కు హద్దు లేదు. అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా వెనుకాడం అంటూ పోస్టులు చేసేవాళ్లు. గత కొంతకాలం నుంచి పరిస్థితిలో ఏంతో మార్పు వచ్చింది. టాలీవుడ్ హీరోలు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. వేరే హీరో ఆడియో వేడుకలకు, పార్టీలకు, ప్రీరిలీజ్ ఫంక్షన్లకు హాజరవుతున్నారు. దీనిపై టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది.
ఇందులో భాగంగానే గతంలో త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల జరిగిన మరో ఆసక్తికర సన్నివేశం జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఆడియో వేడుకకు తారక్ హజరై తామంతా ఒకటేనంటూ తేల్చేశారు. ఇకనైనా ఫ్యాన్ వార్ ఆపాలంటూ సూచించారు.
ఇప్పడు ఇదే కోవలో మరో వేడుక జరగనుందంటూ టాలీవుడ్‌లో టాక్ మొదలైంది. అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ప్రీ రిలీజ్ వేడుకకు రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్‌గా రానున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై చిత్ర యూనిట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏదేమైనా హీరోలు ఇలా మరో హీరో ఈవెంట్లకు వెళ్తూ ఫ్యాన్స్ వార్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలన్న యత్నంపై హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment