
తండ్రి చేసిన పాత్రలోనే..!
ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్న నటుడు రావు రమేష్. లెజెండరీ యాక్టర్ రావు గోపాలరావు తనయుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిర రమేష్.. లేట్గా అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతీ సినిమాలో రావు రమేష్ కంపల్సరీ యాక్టర్గా మారిపోయాడు. ఈ శుక్రవారం రిలీజ్కు రెడీ అవుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు రావు రమేష్.
హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డీజేలో రావు రమేష్ మెయిన్ విలన్గా నటిస్తున్నాడు. రావుగోపాల్ రావు.. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో కనిపించిన గెటప్ లోనే డీజే సినిమాలో నటిస్తున్నాడు రావు రమేష్. కేవలం లుక్ మాత్రమే కాదు.. క్యారెక్టర్ పేరు కూడా రొయ్యల నాయుడే కావటం విశేషం. అయితే క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందన్న రమేష్, తన తండ్రికి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడతానని చెబుతున్నాడు.