
అల్లు అర్జున్ అభిమానులకు షాక్..?
సరైనోడు సినిమాతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్నాడు. బన్నీ బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ సినిమా మీద అంచనాలు రెట్టింపు చేయగా.. చిత్రయూనిట్ ఇప్పుడు అభిమానులకు ఓ షాక్ ఇచ్చింది.
షూటింగ్ సమయంలోనే ఈ సినిమాను మే 19న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. సమ్మర్ బరిలో బన్నీకి మంచి రికార్డ్ ఉండటంతో డీజే బన్నీ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. కానీ అభిమానులకు షాక్ ఇస్తూ డీజే సినిమాను రెండు నెలలపాటు వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తోంది. అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి కాకపోవటం, తరువాత మహేష్ 23 సినిమా రిలీజ్ ఉండటంతో రెండు నెలల పాటు సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.