అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఈ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్‌కి రెడీ సెట్ గో అంటున్నారు మేకర్స్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్’ (2021) వంటి బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్‌గా సేమ్ కాంబినేషన్‌లో ‘పుష్ప: ది రూల్’ రూపొందుతోంది.
షెడ్యూల్ ప్రకారం చిత్రీకరణ పూర్తి అయ్యుంటే ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ సకాలంలో పూర్తి కాకపోవడం.. క్వాలిటీ విషయంలో చిత్రయూనిట్ రాజీ పడకపోవడంతో ఈ మూవీని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజా షెడ్యూల్ విషయానికి వస్తే.. ఈ నెల 22 లేదా 25న ప్రారంభం అవుతుందట. ఈ నెల 28 నుంచి అల్లు అర్జున్ కూడా చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. శరవేగంగా చిత్రీకరణ, పోస్ట్‌ప్రోడక్షన్ పనులు పూర్తి చేసి, డిసెంబరు 6నే సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని భోగట్టా.
Comments
Please login to add a commentAdd a comment