
టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాల దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్. షాక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన హరీష్, గబ్బర్ సింగ్ సక్సెస్ తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మరోసారి భారీ వసూళ్లను సాధించి సత్తా చాటాడు.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న హరీష్, తన సోషల్ మీడియా పేజ్ లో ఆసక్తికరమైన ఫొటోలను పోస్ట్ చేశాడు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేసిన హరీష్, 'నా జీవితంలోనే మరిచిపోలేని సమయం, సంభాషణ' అంటూ ట్వీట్ చేశాడు. అయితే షారూఖ్ ను ఎందుకు కలిశారన్న విషయాన్ని మాత్రం హరీష్ వెల్లడించలేదు. గతంలోనూ పలు సందర్భాల్లో హరీష్ శంకర్, షారూఖ్ ఖాన్ ను కలిశారు. అప్పట్లో షారూఖ్ హీరోగా హరీష్ సినిమా చేయబోతున్నాడన్న వార్తలు కూడా వినిపించాయి.
Thanks a ton King Khan @iamsrk for the wonderful time and memorable conversation of my life ...... Love you pic.twitter.com/pN2eYyEgVv
— Harish Shankar .S (@harish2you) 5 October 2017
Comments
Please login to add a commentAdd a comment