
డీజే వివాదంపై స్పందించిన డైరెక్టర్
సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా డీజే దువ్వాడ జగన్నాథమ్. మాస్ కమర్షియల్ సినిమాల స్సెషలిస్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ తెరపై సరికొత్త వార్కు తెర తీసింది. రికార్డ్ వ్యూస్తో సంచలనాలు నమోదు చేస్తున్న డీజే టీజర్ మరో అరుదైన రికార్డ్ను కూడా సొంతం చేసుకుంది.
ప్రస్తుతం టాప్లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమాకు ఎన్ని లైక్స్ వచ్చాయో.. దాదాపు అదే స్థాయిలో డిస్ లైక్స్ కూడా వచ్చాయి. ఓ స్టార్ హీరో సినిమాకు ఇంత తక్కువ సమయంలో ఇన్ని డిస్ లైక్స్ రావటం కూడా ఓ రికార్డే అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇది పవన్ ఫ్యాన్స్ కావాలనే చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో డీజే దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో స్పందించాడు.
డైరెక్ట్గా డిస్ లైక్స్ వివాదాన్ని ప్రస్థావించకుండా వేదాంత దోరణిలో హరీష్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. డీజే టీజర్ 50 లక్షల వ్యూస్ సాధించినందుకు అభిమానులకు కృతజ్ఙతలు తెలిపిన దర్శకుడు 'నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్థాక్షిణ్యంగా వీరే' అనే శ్రీ శ్రీ కవితను జోడించాడు. అంతేకాదు డిస్ లైక్స్ చేస్తున్న వారిని ఉద్దేశించి.. 'థ్యాంక్స్ ఫర్ దట్ వ్యూస్, దిస్ లైక్స్ యత్ భావం తత్ భవతి' అంటూ కామెంట్ చేశాడు.
Thanks for
— Harish Shankar .S (@harish2you) 27 February 2017
that views
&
this likes
"Yatbhaavam Tadbhavati " pic.twitter.com/twpKAxO6K9