బన్నీ సినిమా పేరు మారుతోందా..? | Title Change for Allu Arjuns Next | Sakshi
Sakshi News home page

బన్నీ సినిమా పేరు మారుతోందా..?

Published Tue, Jun 13 2017 11:45 AM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

Title Change for Allu Arjuns Next

త్వరలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఆ తరువాత ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు. స్టార్ రైటర్గా పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో బన్నీ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖరున సెట్స్ మీదకు వెళ్లనుంది.

అయితే ఈ సినిమాకు 'నా పేరు సూర్య.. నా ఇళ్లు ఇండియా' అనే టైటిల్ను ఫైనల్ చేసినట్టుగా చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం చిత్రయూనిట్ ఈ సినిమాకు మరో టైటిల్ను నిర్ణయించాలని భావిస్తుందట. కొత్త టైటిల్ను సినిమా ఓపెనింగ్ రోజే ఎనౌన్స్ చేసే అవకాశం ఉందంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబు, లగడపాటి శ్రీధర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement