బన్నీ డేట్కు చైతూ..! | Naga Chaitanya Bags DJ Date | Sakshi
Sakshi News home page

బన్నీ డేట్కు చైతూ..!

Apr 11 2017 12:45 PM | Updated on Sep 5 2017 8:32 AM

బన్నీ డేట్కు చైతూ..!

బన్నీ డేట్కు చైతూ..!

అల్లు అర్జున్కు సమ్మర్ సీజన్లో తిరుగులేని రికార్డ్ ఉంది. అందుకే ఈ ఏడాది కూడా సమ్మర్లో రిలీజ్ చేసేందుకు డీజే

అల్లు అర్జున్కు సమ్మర్ సీజన్లో తిరుగులేని రికార్డ్ ఉంది. అందుకే ఈ ఏడాది కూడా సమ్మర్లో రిలీజ్ చేసేందుకు డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాను రెడీ చేస్తున్నాడు. కానీ ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయం కన్నా ఆలస్యం అవుతుండటంతో సమ్మర్ను కాదని కాస్త ఆలస్యంగా రావాలని ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్. ముందుగా అనుకున్నట్టుగా మే 19న కాకుండా జూలై రెండో వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బన్నీ మిస్ అయిన డేట్ను క్యాష్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అక్కినేని నట వారసుడు నాగ చైతన్య. ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటిస్తున్నాడు చైతన్య. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 19 రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. చాలా రోజులుగా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో బన్నీ డీజే రిలీజ్ వాయిదా వేస్తున్నాడన్న వార్త బయటకు వచ్చింది.

దీంతో ఆ గ్యాప్ను క్యాష్ చేసుకోవాలకున్న నాగచైతన్య టీం వెంటనే తమ సినిమాను మే 19 రిలీజ్కు ఫిక్స్ అయ్యారు. నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. నాగార్జున కెరీర్కు నిన్నే పెళ్లాడతా ఎంతటి బూస్ట్ ఇచ్చిందో.. రారండోయ్ వేడుక చూద్దాం నాగచైతన్య కెరీర్కు అంత ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement