స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ సినిమాలో బ్రాహ్మణుడిగా కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ అన్నింటిలో బన్నీని సాఫ్ట్ గా చూపించిన డీజే టీం. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం రిలీజ్ చేసిన పోస్టర్ లో మాత్రం మోడ్ మార్చారు.
పంచ్ కట్టులో కనిపిస్తున్న బన్నీ ఓ సూపర్ యాక్షన్ ఎపిసోడ్ కు రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది ఈ నయా పోస్టర్.సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత బన్నీ చేస్తున్న సినిమా కావటంతో డీజే దువ్వాడ జగన్నాథమ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మే నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.