అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ డీజే దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే సినిమా మీద వచ్చిన వివాదాల కారణంగా విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను దిల్ రాజు పరిచయం చేసిన దర్శకులందరి సమక్షంలో గ్రాండ్గా రిలీజ్ చేశారు. కేవలం కొద్ది గంటల ముందే ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించినా.. రికార్డ్ వ్యూస్తో దూసుకుపోతోంది డీజే ట్రైలర్.
బ్రాహ్మణుడిగా బన్నీ చెప్పిన ఫన్నీ డైలాగ్ లతో పాటు 'పబ్బుల్లో వాయించే డీజే కాదు.. పగిలిపోయేలా వాయించే డీజే..' 'మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్ఛామీ కాదు సార్.. యుద్ధం శరణం గచ్ఛామీ' లాంటి డైలాగ్స్కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయిన 12 గంటల్లోనే రెండున్నర మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది డీజే ట్రైలర్. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రైలర్ లోనే అల్లు అర్జున్ స్వయంగా కన్ఫామ్ చేశాడు.