హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ షూటింగ్ పూర్తి చేసిన అల్లు అర్జున్, ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తన నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేశాడు. స్టార్ రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త సినిమాను ప్రారంభించాడు. లగడపాటి శ్రీధర్, నాగబాబులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా అనే టైటిల్ను ఫైనల్ చేశారు.
ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్ను సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న డీజేను ఈ నెల 23న భారీగా రిలీజ్ చేస్తున్నారు. తొలిసారిగా అల్లు అర్జున్ బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్న డీజే పై భారీ అంచనాలు ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది.