బన్నీకి అన్నీ కలిసొస్తున్నాయ్..! | Dj Duvvada jagannadham solo release | Sakshi
Sakshi News home page

బన్నీకి అన్నీ కలిసొస్తున్నాయ్..!

Published Sat, Jun 17 2017 2:17 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

బన్నీకి అన్నీ కలిసొస్తున్నాయ్..!

బన్నీకి అన్నీ కలిసొస్తున్నాయ్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఈ శుక్రవారం డీజే దువ్వాడ జగన్నాథమ్గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సరైనోడు సినిమాతో కెరీర్లో బిగెస్ట్ హిట్ సాధించిన బన్నీ డీజేతో మరోసారి రికార్డ్లను తిరగరాయలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే సినిమా మీద పాజిటవ్ బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా రిలీజ్ విషయంలో కూడా బన్నీకి టైం బాగా కలిసొస్తుంది.

ఈ వారం మూడు చిన్న సినిమాలు రిలీజ్ అయినా ఏది వచ్చే వారం వరకు థియేటర్లలో నిలబడే పరిస్థితి కనిపించటం లేదు. ఇక వచ్చే వారం డీజే సోలోగా థియేటర్లలోకి వస్తున్నాడు. ఆ తరువాత వారం కూడా బన్నీకి బోనస్గా కలిసొచ్చింది. డీజే రిలీజ్ అయిన వారం తరువాత రిలీజ్ కావాల్సిన కథలో రాజకుమారి, శమంతకమణి సినిమాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే 15 రోజుల పాటు డీజే దూకుడును ఆపేవారే ఉండరు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మరోసారి రికార్డ్లు సృష్టించటం కాయం అంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement