'ట్యూబ్ లైట్' షూటింగ్ షురూ | Salman Khan begins filming Kabir Khan's 'Tubelight' | Sakshi
Sakshi News home page

'ట్యూబ్ లైట్' షూటింగ్ షురూ

Published Thu, Jul 28 2016 4:44 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

'ట్యూబ్ లైట్' షూటింగ్ షురూ

'ట్యూబ్ లైట్' షూటింగ్ షురూ

సినిమా టైటిల్ ఎంత ఆకట్టుకునేలా ఉంటే సినిమా మీద అంత హైప్ క్రియేట్ అవుతుంది. స్టార్ హీరోల సినిమాల విషయంలో అయితే టైటిల్స్ చేసే హంగామా కాస్త ఎక్కువే అని చెప్పాలి. తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ 'ట్యూబ్ లైట్' అనే విభిన్నమైన టైటిల్తో ఫ్యాన్స్ను ఖుషీ చేయనున్నారు. సుల్తాన్ సినిమా బంపర్ హిట్ అయిన తర్వాత.. సల్మాన్ తదుపరి చిత్రం 'ట్యూబ్ లైట్' షూటింగ్ గురువారం మొదలయ్యింది. డైరెక్టర్ కబీర్ ఖాన్ ఈ సినిమాతో సల్మాన్తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఏక్ థా టైగర్, గత ఏడాది బజరంగీ భాయ్ జాన్ సినిమాలు బాక్సాఫీసుని బద్దలుకొట్టగా.. 'ట్యూబ్ లైట్' పేరుతో మరోసారి అలాంటి మ్యాజిక్కే చేసేందుకు కబీర్ ఖాన్ సిద్ధమయ్యారు. 'ట్యూబ్ లైట్' లో భావోద్వేగాలు, హాస్యంతో పాటు కాస్త పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని కబీర్ చెప్పారు. లఢక్ ప్రాంతంలో తొలి రోజు షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో సల్మాన్ ఓ విభిన్నమైన పాత్రలో కనిపిస్తారట. సల్మాన్ సరసన దీపికా పదుకొనే నటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది రంజాన్కి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement