విడుదలకు ముందే కీలక సీన్‌ లీక్‌.. వైరల్‌! | before release, SRK magician act from Tubelight goes viral | Sakshi
Sakshi News home page

విడుదలకు ముందే కీలక సీన్‌ లీక్‌.. వైరల్‌!

Published Fri, Jun 23 2017 11:18 AM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM

before release, SRK magician act from Tubelight goes viral

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ హీరోగా వస్తున్న తాజా సినిమా 'ట్యూబ్‌లైట్‌'.. ఈ శుక్రవారం విడుదల అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్‌ వద్ద వరుస విజయాలతో దూసుకుపోతున్న సల్మాన్‌ 'సుల్తాన్‌' తర్వాత.. 'బజరంగీ భాయ్‌జాన్‌' దర్శకుడు కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో 'ట్యూబ్‌లైట్‌' తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి సల్మాన్‌ నుంచి భారీ హిట్‌ ఖాయమని భావిస్తున్న నేపథ్యంలో విడుదలకు ముందే ఈ చిత్ర యూనిట్‌ షాక్‌ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సీను ఆన్‌లైన్‌లో లీకవ్వడమే కాదు.. అది క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది.

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ 'ట్యూబ్‌లైట్‌' సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఆయన ఇందజాలికుడిగా కనిపించి పిల్లలను అలరించే కీలక సీన్‌ ఆన్‌లైన్‌లో లీక్‌ అయింది. ఈ సీన్‌ అభిమానులను అలరిస్తుండటంతో వెంటనే వైరల్‌గా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement