సూసైడ్ డిసీజ్తో బాధపడుతున్న సల్మాన్..! | salman Khan suffering from the suicide disease | Sakshi
Sakshi News home page

సూసైడ్ డిసీజ్తో బాధపడుతున్న సల్మాన్..!

Published Wed, May 31 2017 5:02 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

సూసైడ్ డిసీజ్తో బాధపడుతున్న సల్మాన్..! - Sakshi

సూసైడ్ డిసీజ్తో బాధపడుతున్న సల్మాన్..!

కండల తిరిగిన దేహంలో 50 ఏళ్లు దాటిన ఇప్పటికీ యూత్ హీరోలా కనిపించే సల్మాన్ ఖాన్, అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఆనందంగా కనిపించే ఈ సీనియర్ బ్యాచిలర్ హీరో, దాదాపు ఏడున్నరేళ్లుగా భయకరమైన వ్యాధితో బాధపడుతున్నట్టుగా తెలిపాడు. ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే వ్యాది సల్మాన్ ను కొంతకాలంగా తీవ్రంగా బాదిస్తుంది. నరాలకు సంబంధించిన ఈ వ్యాది కారణంగా తలలో నరాలు ఉబ్బి విపరీతమైన తలనొప్పి వస్తుందని తెలిపాడు.

ప్రస్తుతం ట్యూబ్ లైట్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న సల్మాన్, దుబాయ్ లో పాల్గొన్న ఓ ప్రమోషన్ ఈవెంట్ లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఎంతో బాధాకరమైన ఈ వ్యాదిని వైద్యులు సూసైడ్ డిసీజ్ గా వ్యవహరిస్తారని తెలిపాడు. అయితే ట్రీట్మెంట్ కు అవకాశం ఉన్నా.. 8 నెలల పాటు హాస్పిటల్ లో ఉండాల్సి వస్తుందని అందుకే ప్రస్తుతానికి ట్రీట్మెంట్ ను వాయిదా వేసినట్టుగా తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement