ట్యూబ్‌లైట్‌: మూడో రోజు వసూళ్లు ఎంతో తెలుసా! | Tubelight crosses the Rs 60-cr mark | Sakshi
Sakshi News home page

ట్యూబ్‌లైట్‌: మూడో రోజు వసూళ్లు ఎంతో తెలుసా!

Published Mon, Jun 26 2017 2:01 PM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM

ట్యూబ్‌లైట్‌: మూడో రోజు వసూళ్లు ఎంతో తెలుసా!

ట్యూబ్‌లైట్‌: మూడో రోజు వసూళ్లు ఎంతో తెలుసా!

కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ నటించిన తాజా సినిమా ‘ట్యూబ్‌లైట్‌’ అంచనాలను అందుకోవడంలో విఫలమైనట్టే కనిపిస్తోంది. ఈద్‌ సందర్భంగా భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా తొలి మూడురోజుల్లో మిశ్రమ వసూళ్లు మాత్రమే రాబట్టింది. తొలిరోజు కేవలం రూ. 21.15 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు, మూడో రోజు కూడా పుంజుకోలేదు. రెండో రోజు శనివారం 21.17 కోట్లు, మూడో రోజు ఆదివారం దాదాపు రూ. 22 కోట్లు సాధించింది.

మొత్తంగా మొదటి మూడు రోజుల్లో ఈ సినిమాకు రూ. 60 కోట్లకు వసూళ్లు దక్కాయి. రంజాన్‌ పర్వదినం కావడంతో నాలుగోరోజు వసూళ్లు పెరగవచ్చునని భావిస్తున్నారు. నాలుగో రోజు వసూళ్లు గణనీయంగా పెరిగితే మొదటి వీకెండ్‌లోనే ఈ సినిమా వందకోట్ల మార్క్‌ను చేరుకొనే అవకాశముందని భావిస్తున్నారు. అదే నెగిటివ్‌ రివ్యూలు, డివైడ్‌ మౌత్‌టాక్‌ ఈ సినిమాను బాగా దెబ్బతీస్తున్నట్టు కనిపిస్తోంది. సోమవారం, మంగళవారం కూడా ‘ట్యూబ్‌లైట్‌’ కలెక్షన్లు పుంజుకోకుంటే.. ఇది బాక్సాఫీస్‌ వద్ద సరిగ్గా వెలుగనట్టేనని వినిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement