
ఇటీవల వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో పడ్డ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టైగర్ జిందాహై. గతంలో ఘనవిజయం సాధించిన ఏక్తా టైగర్ కు సీక్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ నెలాఖరున రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ ట్రైలర్ గత చిత్రాల డిజిటల్ రికార్డులన్నింటినీ చెరిపేస్తూ దూసుకుపోతోంది. తాజాగా యూట్యూబ్‌లో అత్యధిక లైక్‌లు సాధించిన భారతీయ చిత్ర ట్రైలర్‌గా రికార్డ్ సృష్టించింది టైగర్ జిందాహై.
గతంలో ఐదున్నర లక్షల లైకులతో బాహుబలి 2 ట్రైలర్ పేరిట ఉన్న రికార్డ్‌ను 7 లక్షలకు పైగా లైకులతో టైగర్ జిందాహై ట్రైలర్ బ్రేక్ చేసింది. అంతేకాదు ఇప్పటికే మూడు కోట్ల వ్యూస్‌కు చేరువలో ఉన్న ఈ ట్రైలర్, త్వరలో అత్యధిక వ్యూస్ సాదించిన ట్రైలర్‌గా కూడా రికార్డ్ సృష్టింస్తుందని భావిస్తున్నారు. సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు, యష్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ట్రైలర్‌ల లిస్ట్ లో బాహుబలి, ట్రైగర్ జిందాహైలు ముందున్నా.. తమిళ సినిమా ‘మెర్సల్’ టీజర్ 10లక్షలకు పైగా లైకులు సాదదించి ఎవరికీ అందని స్థాయిలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment