బాక్సాఫీస్‌ దగ్గర జవాన్‌ కలెక్షన్ల తుపాన్‌.. రెండో రోజు ఎన్ని కోట్లంటే? | Jawan Box Office Collection Worldwide Day 2: Shah Rukh Khan Film Enters Rs 200 Crore Club- Sakshi
Sakshi News home page

Jawan Movie: రెండు రోజులకే అన్ని కోట్ల క్లబ్బులో చేరిన జవాన్‌.. వీకెండ్‌లో అరాచకమే..

Published Sat, Sep 9 2023 12:52 PM | Last Updated on Sat, Sep 9 2023 2:11 PM

Jawan Box Office Collection Worldwide Day 2: Shah Rukh Khan Film Enters Rs 200 Crore Club - Sakshi

జవాన్‌ సినిమాకు సినీప్రియులు జై కొడుతున్నారు. షారుక్‌ ఖాన్‌ యాక్టింగ్‌, యాక్షన్‌ ఇంకా కళ్లముందే కదలాడుతోందంటున్నారు. జవాన్‌ చిత్రాన్ని ఒక్కసారి చూస్తే తనివి తీరదని మరోసారి చూస్తే కానీ దిల్‌ ఖుష్‌ అయ్యేలా లేదని ఫీలవుతున్నారు. మొత్తానికి రికార్డులు సృష్టించాలన్నా నేనే, రికార్డులు తిరగరాయాలన్నా నేనే అన్నట్లుగా షారుక్‌ బాక్సాఫీస్‌ దగ్గర విజృంభిస్తున్నాడు.

పఠాన్‌ మొదటి రోజు రూ.106 కోట్లు రాబడితే జవాన్‌ ఆ రికార్డును బ్రేక్‌ చేసింది. తొలిరోజు ఈ సినిమా రూ.126 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. రెండో రోజు కూడా తగ్గేదేలే అన్న రీతిలో కలెక్షన్స్‌ రాబట్టింది. ఏకంగా రూ.113 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంటే రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్బులో చేరింది. ఈ వీకెండ్‌ పూర్తయ్యేసరికి రూ.500 కోట్ల క్లబ్బులో చేరే ఛాన్స్‌ ఉందంటున్నారు సినీప్రియులు.

మరోపక్క బాక్సాఫీస్‌ దగ్గర తిరుగు లేకుండా దూసుకుపోతున్న గదర్‌ 2 చిత్రానికి జవాన్‌ బ్రేక్‌ వేసింది. ఈ మూవీ నిన్నటివరకు రూ.510 కోట్లు రాబట్టింది. తాజాగా రిలీజైన జవాన్‌ గట్టి పోటీ ఇస్తుండటంతో గదర్‌ 2 కలెక్షన్స్‌కు భారీ స్థాయిలో గండి పడనున్నట్లు కనిపిస్తోంది.

చదవండి: అర్ధరాత్రి శివాజీ, షకీలా డ్రామా.. పిచ్చోళ్లను చేస్తున్నారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement