jawaan
-
Nayanathara : అట్లీపై నయనతార కోపంలో నిజమెంత?
తమిళసినిమా: నటి నయనతార దర్శకుడు అట్లీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ప్రచారం. మరి ఇందులో నిజం ఎంత? దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నయనతార తొలిసారిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి నటించిన చిత్రం జవాన్. షారుక్‌ఖాన్ కథానాయకుడిగా నటించి సొంతంగా నిర్మించిన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ యువదర్శకుడు అట్లీ బాలీవుడ్ పరిచయం అయ్యారు. కాగా ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనె కూడా నటించిన విషయం తెలిసిందే. చిత్రం ఈనెల 7న విడుదలై బాక్సాఫీస్ షేక్ చేస్తూ రూ.1000 కోట్ల క్లబ్ చేరువలో ఉంది. అలాంటి చిత్రంలో దర్శకుడు తన పాత్రకు సరైన న్యాయం చేయలేదనే అసంతృప్తితో నయనతార ఉన్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. Witnessing the magic of my favouritest @iamsrk last night in a packed hall amidst the cacophony of whistles & cheer was something else. #Jawan is truly an exceptional film. @Atlee_dir you are a magician who knows the pulse of the nation. @NayantharaU you were ethereal. No words… pic.twitter.com/YKdc3bsnsk — Genelia Deshmukh (@geneliad) September 8, 2023 జవాన్ చిత్రంలో నటి దీపిక పడుకొనెకు అతిథి పాత్ర అని చెప్పి ఆమెకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లు నయనతార ఆవేదన చెందుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకే నయనతార ఆ చిత్ర ప్రచార కార్యక్రమంలోగానీ, విజయోత్సవ వేడుకల్లోగాని పాల్గొనలేదనేది నెటిజన్ల విశ్లేషణ. అయితే ఈ ప్రచారాన్ని నయనతార వర్గం తీవ్రంగా ఖండిస్తున్నారు. నిజానికి షారుఖ్‌ఖాన్ అంటే నయనతారకు చాలా ఇష్టమని అందుకే ఆమె ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారని వారు పేర్కొంటున్నారు. Nayanthara special message to all after #Jawan success. She loved working with @iamsrk ❤️ SRK Nayanthara ❤️❤️ @NayantharaU + @iamsrk#JawanCreatesHistory #JawanEvent pic.twitter.com/S8ZU3uD2zp — Abu Bakar (@_Abubakar03) September 15, 2023 ఇక చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన లేదన్నది ఆమె పాలసీ అని అందుకే జవాన్ చిత్ర ప్రచారంలో కూడా పాల్గొనలేదని అంటున్నారు. అదేవిధంగా ముంబైలో జరిగిన చిత్ర సక్సెస్ కార్యక్రమంలో పాల్గొనపోవడానికి కారణం, అదేరోజు నయనతార తల్లి పుట్టినరోజు కావడంతో ఆమె తన తల్లికి ప్రాముఖ్యత ఇచ్చారని చెబుతున్నారు. అయితే దర్శకుడు అట్లీపై నయనతార ఆగ్రహం అని వారు, వీరు అంటుండడమే కానీ నయన మాత్రం ఏవిధంగా స్పందించలేదన్నది గమనార్హం. Nayanthara spotted in Mumbai #Nayanthara #VigneshShivan @NayantharaU #Jawan pic.twitter.com/wcJRbypqAl — Deccan Mirror (@TheDeccanMirror) September 8, 2023 -
ఆర్మీ జవాన్ కిడ్నాప్.. హత్య
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో సాయుధ ముఠా ఒకటి ఆర్మీ జవాన్‌ను పొట్టనబెట్టుకుంది. రాష్ట్రంలోని ఇంఫాల్ పశి్చమ జిల్లా తరుంగ్ గ్రామానికి చెందిన సిపాయి సెర్తో థంగ్‌థంగ్ కొమ్.. కంగ్పొక్పి జిల్లా లీమఖోంగ్లోని ఆర్మీ డిఫెన్స్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన ప్లటూన్‌లో విధులు నిర్వర్తిస్తన్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన సెలవుపై స్వగ్రామానికి చేరుకున్నారు. శనివారం ఉదయం ఇంట్లో ఉన్న ఆయనను గుర్తు తెలియని సాయుధులు తుపాకీతో బెదిరించి తమ వాహనంలో తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం ఖునింగ్‌థెక్ గ్రామ సమీపంలో నుదుటిపై బుల్లెట్ గాయంతో ఆయన విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు. -
బాక్సాఫీస్ దగ్గర జవాన్ కలెక్షన్ల తుపాన్.. రెండో రోజు ఎన్ని కోట్లంటే?
జవాన్ సినిమాకు సినీప్రియులు జై కొడుతున్నారు. షారుక్ ఖాన్ యాక్టింగ్, యాక్షన్ ఇంకా కళ్లముందే కదలాడుతోందంటున్నారు. జవాన్ చిత్రాన్ని ఒక్కసారి చూస్తే తనివి తీరదని మరోసారి చూస్తే కానీ దిల్ ఖుష్ అయ్యేలా లేదని ఫీలవుతున్నారు. మొత్తానికి రికార్డులు సృష్టించాలన్నా నేనే, రికార్డులు తిరగరాయాలన్నా నేనే అన్నట్లుగా షారుక్ బాక్సాఫీస్ దగ్గర విజృంభిస్తున్నాడు. పఠాన్ మొదటి రోజు రూ.106 కోట్లు రాబడితే జవాన్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. తొలిరోజు ఈ సినిమా రూ.126 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. రెండో రోజు కూడా తగ్గేదేలే అన్న రీతిలో కలెక్షన్స్ రాబట్టింది. ఏకంగా రూ.113 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంటే రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్బులో చేరింది. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.500 కోట్ల క్లబ్బులో చేరే ఛాన్స్ ఉందంటున్నారు సినీప్రియులు. మరోపక్క బాక్సాఫీస్ దగ్గర తిరుగు లేకుండా దూసుకుపోతున్న గదర్ 2 చిత్రానికి జవాన్ బ్రేక్ వేసింది. ఈ మూవీ నిన్నటివరకు రూ.510 కోట్లు రాబట్టింది. తాజాగా రిలీజైన జవాన్ గట్టి పోటీ ఇస్తుండటంతో గదర్ 2 కలెక్షన్స్‌కు భారీ స్థాయిలో గండి పడనున్నట్లు కనిపిస్తోంది. చదవండి: అర్ధరాత్రి శివాజీ, షకీలా డ్రామా.. పిచ్చోళ్లను చేస్తున్నారా? -
జవాన్ సినిమాలో బిగ్‌బాస్ బ్యూటీ.. ఇచ్చిపడేసిందిగా!
పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డుల దుమ్ము దులిపాడు షారుక్ ఖాన్. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. తన నుంచి మరో సినిమా వస్తుందంటే అందరి అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. ఆ రేంజ్‌కు తగ్గట్లే సౌత్ డైరెక్టర్ అట్లీ ఓ కథ సిద్ధం చేసుకుని వినిపించగా షారుక్‌కు కూడా తెగ నచ్చేసింది. ఇంకేముంది జవాన్ సినిమా మొదలైంది. లేడీ సూపర్ స్టార్ నయనతార జవాన్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. దీపికా పదుకోణ్ ముఖ్య పాత్రలో మెరిసింది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి ఏ ఒక్కరూ లేరే అన్న లోటును తీర్చేసిందో బ్యూటీ. బిగ్‌బాస్ బ్యూటీ సిరి హన్మంతు జవాన్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసింది. ఇందులో ఆమె పాత్రకు డైలాగులు లేవు కానీ, షారుక్ పక్కనే కనిపించింది. జైలర్ ఆజాద్‌గా షారుక్ నటించగా, ఆయనకు సబ్ ఆర్డినేట్ ఆఫీసర్‌గా సిరి కనిపించింది. బాలీవుడ్ సినిమాలో బిగ్‌బాస్ బ్యూటీ చోటు దక్కించుకోవడం మామూలు విషయం కాదంటున్నారు నెటిజన్లు. బిగ్‌బాస్ ద్వారా మూటగట్టుకున్న నెగెటివిటీని ఈ బ్యూటీ తన అందం, ప్రతిభ ద్వారా వచ్చిన ఆఫర్లతో తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. తమిళ దర్శకుడు అట్లీ కూడా జవాన్‌లో చిన్న పాత్రలో మెరిశారు. ఇకపోతే జవాన్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో షారుక్ గత సినిమా రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోతున్నారు. మరి ఈ మూవీ రానున్న రోజుల్లో ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! చదవండి: జవాన్ సినిమా ఓటీటీ రైట్స్‌కు రికార్డు ధర.. ఆ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు ఛాన్స్! మిస్ శెట్టి కూడా అక్కడే.. -
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, జవాన్.. రెండు సినిమాలు ఒకే ఓటీటీలో!
అనుష్క చాలా కాలం తర్వాత చేసిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (సెప్టెంబర్ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పి.మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించగా నాజర్, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు పాజిటివ్ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు మరో భారీ సినిమా కూడా థియేటర్లలో విడుదలైంది. అదే జవాన్. జవాన్.. బోలెడన్ని ప్రత్యేకతలు ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలున్నాయి. కోలీవుడ్ దర్శకుడు అట్లీ దీనికి దర్శకత్వం వహించడం, లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం, క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం, తమిళ స్టార్ విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం, దీపికా పదుకునే అతిథి పాత్రలో మెరవడం.. ఇలా చాలానే ఉన్నాయి. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కూడా నేడే విడుదలవగా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఈ రెండు సినిమాలు ఈపాటికే ఓటీటీ పార్ట్‌నర్స్‌తో డీల్ కుదుర్చుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్ రూ.120 కోట్లు పెట్టి మరీ జవాన్ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, జవాన్.. రెండు సినిమాల ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రెండూ ఒకే ఓటీటీలో సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజులకు సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఫ్లాప్ టాక్ వచ్చిందంటే అంతకంటే ముందే ఓటీటీలో ప్రత్యక్షమైపోతున్నాయి. హిట్ టాక్ వస్తే కొంతకాలం ఆగిన తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. అంటే, ఈ రెండు సినిమాల ఫలితాన్ని బట్టే ఓటీటీ విడుదల ఖరారు కానుంది. మిస్ శెట్టి.. సెప్టెంబర్ నెలాఖరులో లేదంటే అక్టోబర్ నెల ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది! జవాన్ మాత్రం అక్టోబర్ చివర్లో రిలీజయ్యేట్లు కనిపిస్తోంది. చదవండి: 'జవాన్' మూవీ రివ్యూ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’మూవీ రివ్యూ -
షారుక్-నయన్.. కొత్త పాట
‘ఛలోనా..’ (పద) అంటూ షారుక్ ఖాన్, నయనతార ప్రేమ పాట పాడుకోనున్నారు. షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో నయనతార కథానాయికగా నటించిన చిత్రం ‘జవాన్’. ఇప్పటివరకూ ఈ చిత్రం నుంచి విడుదలైన షారుక్, నయనతార లుక్స్ యాక్షన్ సీన్స్‌కి సంబంధించినవి. అలాగే పాటల విషయానికి వస్తే.. షారుక్, ప్రియమణి, డ్యాన్సర్స్‌పై చిత్రీకరించిన మాస్ సాంగ్ ‘దుమ్మే దులిపేలా..’ ఇటీవల విడుదలైంది. సోమవారం షారుక్, నయనతారల రొమాంటిక్ సాంగ్‌ని, ΄పోస్టర్ని విడుదల చేయనున్నారు. ‘ఛలోనా..’ అంటూ సాగే ఈ పాట షారుక్ కెరీర్‌లోని బెస్ట్ రొమాంటిక్ సాంగ్స్‌లో ఒకటి అవుతుందని యూనిట్ పేర్కొంది. అనిరుధ్ రవిచందర్ స్వరపరచిన ఈ పాటను ఆదిత్య ఆర్.కె., ప్రియా మాలి పాడారు. ‘ఛలోనా..’ని హిందీ, తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మించిన ‘జవాన్’ సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. -
ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ఆయనతో కలిసి నటించేవాడిని: విజయ్ సేతుపతి
‘‘షారుక్ ఖాన్ కోసమే ‘జవాన్’ చిత్రంలో నటిస్తున్నాను. నాకు ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వకపోయినా కూడా ఆయనతో కలిసి నటించేవాణ్ణి’’ అన్నారు నటుడు విజయ్ సేతుపతి. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ‘ముంబైకర్’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల (జూన్ 2) విడుదలైంది. ప్రస్తుతం ఆయన షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న హిందీ సినిమా ‘జవాన్’ లో విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ–‘‘షారుక్ అంటే నాకు అభిమానం. ఆయన కోసమే ‘జవాన్’లో విలన్‌గా చేస్తున్నా. నాకు పారితోషికం ఇవ్వకున్నా ఆయనతో కలిసి నటించేవాణ్ణి’’ అంటూ షారుక్ ఖాన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘జవాన్’ సినిమా సెప్టెంబర్ 7న విడుదలకానుంది. కాగా త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ (2019) లో విజయ్ సేతుపతి నటనపై షారుక్ ఖాన్ గతంలో ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. -
ఆ నెలంతా పాన్ ఇండియా మూవీసే.. ఏకంగా అన్ని!
తెలుగు స్టార్ హీరోలు 'పాన్ ఇండియా' జపం చేస్తున్నారు. ప్రభాస్ నుంచి నిఖిల్ వరకు ఈ ప్రయత్నాల్లో ఫుల్ బిజీ బిజీ. ఈ తరహా సినిమాలు చేస్తున్నారు గానీ హిట్స్ మాత్రం చాలా తక్కువ. మరోవైపు పాన్ ఇండియా సినిమాలు నెలకు ఒకటి రావడమే గగనమైపోయిన ఈ రోజుల్లో.. ఏకంగా ఓ నెలంతా అలాంటి చిత్రాలే వస్తే? బాక్సాఫీస్ కి బ్యాండ్, మూవీ లవర్స్ కి పండగ గ్యారంటీ. మీకు సినిమాలంటే బాగా పిచ్చి ఉండి, ఓ మంచి మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మాత్రం సెప్టెంబరు వరకు ఆగండి. ఎందుకంటే పాన్ ఇండియాతోపాటు సరైన మాస్ చిత్రాలన్నీ అదే నెలలో విడుదలకు సిద్ధమైపోతున్నాయి. ఒకటి రెండు కాదు ఏకంగా వారానికొకటి చొప్పున నాలుగుకి పైనే బరిలో ఉన్నాయి. వీటితోపాటు తెలుగు సినిమా ఒకటి, డబ్బింగ్ మూవీ మరొకటి లైన్ లో ఉన్నాయి. ఆ లిస్ట్ ఏంటో ఓసారి చూసేద్దాం. (ఇదీ చదవండి: వారం గడిచింది.. 'ఆదిపురుష్' కలెక్షన్స్ ఎన్ని కోట్లు?) ప్రభాస్ ఊరమాస్! 'బాహుబలి' తర్వాత అలాంటి హిట్ ఎప్పుడు పడుతుందా? రచ్చ ఎప్పుడు చేద్దామా అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా వెయిటింగ్. అయితే దీని తర్వాత థియేటర్లలోకి వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలు వందల కోట్లు సాధించాయి గానీ హిట్ కొట్టలేకపోయాయి. ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ ప్రశాంత్ నీల్ తీస్తున్న ఊరమాస్ మూవీ 'సలార్'పైనే. సెప్టెంబరు 28న ఇది రిలీజ్ కానుంది. ఇది హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు బాక్సాఫీస్ రికార్డులు గల్లంతవడం, సరికొత్తవి నమోదు కావడం పక్కా. రౌడీ హీరో ఈసారైనా? విజయ్ దేవరకొండ పాన్ ఇండియా వైడ్ మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేది ఈ సెప్టెంబరులోనే. అదే నెల 1వ తేదీన 'ఖుషి' చిత్రం రిలీజ్ కానుంది. ఇది హిట్ కావడం విజయ్ కి చాలా ముఖ్యం. ఎందుకంటే 'లైగర్'తో ఇండస్ట్రీని దున్నేస్తా అదీఇదీ అని గతేడాది ఓ రేంజు ఎలివేషన్స్ ఇచ్చుకున్నాడు. కట్ చేస్తే ఆ మూవీ బొక్కాబోర్లా పడింది. ఇప్పుడు హిట్ కొడితే ఓకే లేదంటే మాత్రం విజయ్ కి కష్టాలు తప్పవు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) షారుక్ కొట్టాల్సిందే! 2018లో 'జీరో' ఫ్లాప్ కావడంతో షారుక్ పునరాలోచనలో పడిపోయాడు. దాదాపు ఐదేళ్లపాటు బిగ్ స్క్రీన్ కి దూరమయ్యాడు. ఈ ఏడాది జనవరిలో 'పఠాన్'తో వేరే లెవల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. వరల్డ్ వైడ్ రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాద్ షాలో పస తగ్గలేదని నిరూపించాడు. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలంటే మరో హిట్ కచ్చితంగా కావాలి. ఇప్పుడది 'జవాన్'తో వచ్చేలా కనిపిస్తుంది. తమిళ దర్శకుడు అట్లీ తీస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని దేశభక్తి ప్లస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తీశారు. సెప్టెంబరు 7న రానున్న ఈ చిత్రానికి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు సునామీ గ్యారంటీ. రామ్ ఈసారి మాత్రం! రామ్ పేరు చెప్పగానే అందరికీ 'ఇస్మార్ట్ శంకర్' గుర్తొస్తుంది. దీని తర్వాత రెడ్, ద వారియర్ చిత్రాలు చేశాడు గానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయాయి. దీంతో ఒకేసారి హిట్ కొట్టడంతో పాటు పాన్ ఇండియా లెవల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయాడు. బోయపాటి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న సినిమాని ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో తీస్తున్నారు. దసరాకు విడుదల చేయాలనుకున్నారు గానీ ఇప్పుడు దాని విడుదల తేదీ మార్చారు. సెప్టెంబరు 15న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలు కూడా! ఇలా పైన చెప్పినట్లు సెప్టెంబరులోని నాలుగు వారాల్లో నాలుగు పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. వీటితో పాటు 'డీజే టిల్లు 2' మూవీ సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న 'చంద్రముఖి 2' కూడా ఇదే నెలలో వచ్చే అవకాశముందని అంటున్నారు. డేట్ ఫిక్స్ అయితే గానీ క్లారిటీ రాదు. సో అదనమాట విషయం. సెప్టెంబరు రావడానికి మరో రెండు నెలల సమయం ఉంది. కాబట్టి దొరికిన ఈ టైంలో హైప్ పెంచుకోండి. ఎందుకైనా మంచిది ఏ మూవీకి వెళ్లి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఇప్పుడే ఓ ప్లాన్ రెడీ చేసి పెట్టుకోండి! (ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!) -
మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తత... కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మృతి
మణిపూర్‌లో మరోసారి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. జూన్ 5న రాత్రంతా సాగిన ఈ ఘర్షణల్లో ఒక బీఎస్ఎఫ్ జవాను మృతి చెందగా అస్సాం రైఫిల్ బలగాల్లోని ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవల వినియోగాన్ని జూన్ 10 వరకు పొడిచింది మణిపూర్ ప్రభుత్వం. స్వయంగా అమిత్ షా రంగంలోకి దిగి... మణిపూర్ లో మే 3న జరిగిన అల్లర్లలో మెయితేయి కుకీ తెగల మధ్య దారుణ హింసాకాండ చోటు చేసుకుంది. సుమారుగా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. మెయితేయి తెగ వారు తమని ఎస్టీల్లో చేర్చాలని చేస్తున్న డిమాండ్ ను కుకీ తెగ వారు వ్యతిరేకించడమే ఈ అల్లర్లకు ప్రధాన కారణం. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 10 వేల అస్సాం రైఫిల్ బలగాలను మోహరించాయి. ఈ రెండు తెగల మధ్య సమన్వయాన్ని కుదిర్చి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. తగ్గినట్టే తగ్గి... అంతలోనే మళ్ళీ... ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతోందనుకుంటున్న తరుణంలో మళ్ళీ సోమవారం రాత్రి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మణిపూర్ సుగ్ను, సెరో ప్రాంతంలో బిఎసెఫ్ బలగాలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక బిఎస్ఎఫ్ జవాను మృతి చెందగా అస్సాం రైఫిల్ బలగాల్లోని ఇద్దరికి బులెట్ గాయాలయ్యాయి. ఇంకా ఉద్రిక్తత తగ్గని నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం వెంటనే ఇంటర్నెట్ సేవల నిషేధాన్ని జూన్ 10 వరకు మరో ఐదు రోజులపాటు పొడిగించింది. -
నా ముఖం బాగోలేదని సర్జరీ చేయించుకోమన్నారు: నటి
బాలీవుడ్ నటి సన్యా మల్హోత్రా నటించిన 'కథల్' ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించిన మల్హోత్రా పేరు ప్రస్తుతం బాలీవుడ్లో మారుమోగిపోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ క్రమంలో తన సినీ కెరీర్ ఎంట్రీలో ఎదురైన కొన్ని ఇబ్బందులను పంచుకుంది. (ఇదీ చదవండి: సైతాన్ ట్రైలర్.. పచ్చిబూతులు, అడల్ట్ సన్నివేశాలు!) సర్జరీ చేయించుకోమని సలహా ''నాకు ఇప్పటికీ గుర్తు.. దంగల్ సినిమా షూటింగ్ సమయంలో ఒకరు నా రూపురేఖలు బాగాలేవని, అందుకోసం దవడకు శస్త్ర చికిత్స చేయుంచుకోవాలని సలహా ఇచ్చారు. అప్పుడు నేను ఒక్కటే చెప్పాను.. నా అందం పట్ల సంతోషంగానే ఉన్నాను. నా దవడను చూసి అవకాశాలు రాలేదు, అలా అని వచ్చిన ఛాన్సులు పోలేదు కూడా! నేను ముంబైకి ఆడిషన్స్ కోసం వచ్చినప్పుడు కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నాను. కాన్ఫిడెన్స్‌తో ముందుకు సాగాను'' అని గుర్తు చేసుకుంది. దంగల్ మూవీలో అమీర్ ఖాన్, ఫాతిమా సనాలతో కనిపించింది మల్హోత్రా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఇప్పుడు జవాన్‌లో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. (ఇదీ చదవండి: గ్రాండ్‌గా సుమలత తనయుడి వివాహం, పెళ్లి ఫోటోలు వైరల్) జవాన్‌లో ఛాన్స్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. “బాలీవుడ్లో నేనే అదృష్టవంతురాలిని. దయచేసి దీనిని హెడ్‌లైన్‌గా ఉపయోగించకండి. గొప్ప నటీనటులతో కలిసి పనిచేయాలని నేను చిన్నప్పుడు కలలు కనేదాన్ని.. నేను జవాన్‌లో భాగమని ఈ వార్తను అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది'' అని మల్హోత్రా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే జవాన్‌లో షారుఖ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో విజయ్, దీపికా పదుకొణె అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. -
బికినీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయన్.. అందుకేనా భారీ రెమ్యునరేషన్!
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఏ సన్నివేశంలో నటించటానికైనా రెడీగా ఉండాలి. ఇక కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ గ్లామర్ బాగా ప్లస్ అవుతుంది. ఈ నాటి స్టార్ హీరోయిన్స్ అందరూ కెరీర్ స్టార్టింగ్ లో అందాలు ఒలకబోసివారే. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు.....ఇంటిమేట్ సీన్స్ లో వారి టాలెంట్ చూపించారు. గ్లామర్ షో చేయటానికి ఇష్టపడే హీరోయిన్స్ కూడా బికినీ డ్రెస్ లో నటించటానికి నో చెబుతారు. కొంతమంది హీరోయిన్స్ మాత్రమే బికినీ ధరించి ప్రేక్షకులకి ట్రీట్ ఇస్తారు. వారిలో సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. అయితే గత కొంతకాలంగా నయనతార రోమాంటిక్ సన్నివేశాలకు...బోల్డ్ అటెంప్ట్ లకు దూరంగా ఉంటుందనే చెప్పాలి. అయితే నయనతార కెరీర్ స్టార్టింగ్ లో యూత్ ను తన గ్లామర్ తోనే ఆకట్టుకుంది. ఎక్కువ కమర్షియల్ మూవీస్ లో నటించిన నయనతార తన అందాలతో కనువిందు చేయటానికి ఏ మాత్రం వెనకడుగు వేసేది కాదు. అజిత్ బిల్లా సినిమాలో నయనతార బికినీ ధరించి కనిపించింది. అలాగే శింబు వల్లభ సినిమాలో లిప్ లాక్ సీన్స్ తో నటించటమే కాదు..ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా నటించింది. అలా నయనతార తనని తాను స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిస్ చేసుకుంది. ఆ తర్వాత వుమెన్ సెంట్రిక్ సినిమాలవైపు టర్న్ తీసుకుని తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇన్నాళ్లు సౌత్ మూవీస్ చేసిన నయన్.. షారుఖ ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నయనతార గతంలో ఎప్పుడూ లేని విధంగా జవాన్ సినిమాలు కనిపించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె గ్లామర్ షో కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతుందట. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోనే ఆమె స్టన్ అయ్యేలా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. షారూఖ్ ప్రతి సినిమాలో ఇంటిమేట్ సీన్స్ తప్పకుండా కనిపిస్తాయి. రీసెంట్ గా పఠాన్ సినిమాలో హీరోయిన్ దీపికా పదుకునేతో చాలా ఘాటు సీన్స్ ఉన్నాయి. అలాగే బేషరమ్ సాంగ్ లో దీపికా బికినీ వేసుకుని నటించింది. అలాగే జవాన్ లో కూడా హీరోయిన్ క్యారెక్టర్ లో ఆ రేంజ్ గ్లామర్ షో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో నయన్ బికినీ సీన్ చేయబోతుందనే టాక్ బీటౌన్ లోనే కాదు చెన్నైలో కూడా వినిపిస్తోంది. బికినీ సీన్లు ఉన్నాయి కాబట్టే.. రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుందట నయన్. ప్రతి సినిమాకు రూ.6 నుంచి 7 కోట్ల వరకు తీసుకునే నయన్.. జవాన్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు డిమాండ్ చేసిందట. ఇందులో నిజమెంత ఉందనేది తెలియదు. ఒకవేళ నయన్ జవాన్ లో బికినీ కనిపిస్తే ..సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోవటం మాత్రం గ్యారెంటీ. జవాన్ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
అసలు సిసలైన పాన్ ఇండియా సినిమాకి రంగం సిద్ధం
-
జవాన్‌కు బై బై
వెండితెర ‘జవాన్’కు రీసెంట్గా బై బై చెప్పారు హీరోయిన్ దీపికా పదుకొనె. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జవాన్’. విజయ్ సేతుపతి, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చెన్నైలో ప్రారంభించిన ఈ చిత్రం కొత్త షెడ్యూల్లో షారుక్, దీపికా, విజయ్ సేతుపతిలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించింది యూనిట్. ప్రస్తుతం ‘జవాన్’ షూటింగ్ జరుగుతున్నప్పటికీ దీపిక పాత్ర చిత్రీకరణ పూర్తయింది. దీంతో యూనిట్‌కి బై బై చెప్పారామె. ఈ సినిమాలో షారుక్ ద్విపాత్రాభినయం చేశారనీ, అందులో ఒక షారుక్‌కి భార్య పాత్రలో దీపికా నటించార ని టాక్. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ఎక్కువగా ఉండదట. ఓ అతిథి పాత్ర అని బాలీవుడ్ టాక్. కాగా ‘జవాన్’ కాకుండా ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, షారుక్ ఖాన్ ‘పఠాన్’, రణ్వీర్ సింగ్ ‘సర్కస్’, హృతిక్ రోషన్ ‘ఫైటర్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు దీపికా పదుకొనె. -
మావోయిస్టుల అదుపులో ఆదివాసీలు
చర్ల: తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలకు చెందిన సుమారు 100 మంది ఆదివాసీ గిరిజనులను మావోయిస్టులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజులు గడిచినా వారిని వదలకపోవడంతో ఆదివాసీల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న పోలీసు క్యాంపులను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనల్లో అన్ని గ్రామాల ఆదివాసీలు, గిరిజనులు పాల్గొనాలని మావోయిస్టులు గతంలో పిలుపునిచ్చారు. అయితే, వారు స్పందించకపోవడంతోనే మావోయిస్టులు ఆగ్రహించినట్లుగా తెలుస్తోంది. కాగా, మావోయిస్టులు పలువురిని బంధించిన విషయాన్ని తమకు చెప్పలేదనే కారణంతో శనివారం ఉదయం కుర్నపల్లికి వెళ్లిన సీఐ అశోక్, ఎస్సై రాజువర్మ పలువురు యువకులను చర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే సాయంత్రం వారిని విడుదల చేసి నట్లు విలేకరులకు సమాచారం ఇచ్చారు. జవాన్‌ను హతమార్చిన మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో దారుణానికి ఒడిగట్టారు. గంగుళూరు పోలీ స్ స్టేషన్‌కు చెందిన జవాన్ అందో పోయం ను (49) శుక్రవారం కిడ్నాప్ చేసి తీసుకెళ్లా రు. శనివారం అతడిని హతమార్చి మృతదేహాన్ని గంగుళూరు రహదారిపై పడేశారు. -
2019 పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి హతం
-
జావా.. నాటి హవా !
విజయవాడ స్పోర్ట్స్: ఒకప్పుడు పెద్దవాళ్లు ఆఫీషియల్‌గా వాడే బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే... 1987కు ముందువరకు కుర్రకారు బైక్ ఏదంటే జావా మోటార్ సైకిలే. 1929లో చెకోస్లేవియాలో తయారైన ఈ జావా మోటారు సైకిల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. రోడ్డుపైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ సింహం అయితే...జవా మోటార్ సైకిల్ పులి అనేవాళ్లు. ఇప్పటికీ దీనికున్న క్రేజీ ఏమాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. బీటింగ్‌కు మారుపేరు జావానే. టుస్ట్రోక్ ఇంజిన్ ఇది. 350 సీసీ, 250 సీసీ బైక్‌లు ఉన్నాయి. బండి స్టార్ట్ చేయడానికి కిక్ రాడ్డే గేర్ రాడ్ ఉన్న బైక్ ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఒక్క జావా బైక్ మాత్రమే. పూర్తిగా ఎగ్ షేప్‌గా ఏ ఒక్క పార్టు బయటకు కనిపించకుండా ఉండే బైక్ జావా బైక్. ఇప్పటికీ రోడ్డుపై ఎన్ని వందల బైక్‌లు వెళ్లినా...ఒక జావా బైక్ చాలు తన ఉనికిని చాటుకోవడానికి. పాత సినిమాల్లో హీరోలు వాడిన బైక్ ఇది. 1980 తరువాత జావా బైక్‌ని కొంతమార్పులు చేసి యజ్డీ బైక్‌గా పేరు మార్చారు. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలకు పైగా ఈ బైక్ ఏలింది. పాత బులెట్ మాదిరిగానే ఎన్ని సంవత్సరాలు బండి అయినా సరే మళ్లీ దానిని కొత్త బైక్‌గా తయారు చేసుకునే వీలున్న బైక్ ఇది. బండి ఎంత పాతదయితే అంత క్రేజ్ ఉంది. దేశవ్యాప్తంగా జావా క్లబ్‌లు దేశవ్యాప్తంగా జావా క్లబ్‌లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జులై 8న ఇంటర్నేషనల్ ‘జావా డే’ ని నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జవా క్లబ్‌లు వరల్డ్ జావా డేని నిర్వహిస్తున్నాయి. విజయవాడలో కూడా ‘బీటింగ్ హార్ట్స్ జావా’ క్లబ్ ఉంది. ఆ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8 ఎనిమిది గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి క్లబ్ సభ్యులంతా తమ బైక్‌లపై రైడ్ చేయనున్నారు. జావా బైక్‌ల బీటింగ్‌తో కనులవిందు చేయనున్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - జవాన్
-
'అవన్నీ రూమర్స్.. మహేష్ తో సినిమా లేదు'
సూపర్ స్టార్ మహేష్ బాబు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ సినిమా రానున్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో కలిసిన మహేష్, సాయి ధరమ్ లతో దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడట. అయితే ఆ హీరోలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోయినా.. మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. తాజాగా జవాన్ ప్రమోషన్ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఈ ప్రాజెక్ట్ పై స్పందించాడు. తాను మహేష్ బాబుతో కలిసి సినిమా చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్నీ రూమర్సే అని కొట్టి పారేశాడు. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్నట్టుగా తెలిపిన సాయి, మంచి కథతో దొరికితే వరుణ్ తేజ్ తో కలిసి ఓ సినిమా చేసే ఆలోచన ఉన్నట్టుగా చెప్పాడు. వీటితో పాటు గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీస్ సంస్థలతోనూ సినిమాలు చేయనున్నట్టుగా ప్రకటించాడు. -
'జవాన్' మూవీ రివ్యూ
టైటిల్ : జవాన్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : సాయి ధరమ్ తేజ్, ప్రసన్న, మెహరీన్, సంగీతం : తమన్ దర్శకత్వం : బీవీయస్ రవి నిర్మాత : కృష్ణ (అరుణాచల్ క్రియేషన్స్) కెరీర్ స్టార్టింగ్ లో మంచి ఫాంలో కనిపించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్, తరువాత వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో పడ్డాడు. ఈ సమయంలో తన రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా ఓ మెచ్యూర్డ్ క్యారెక్టర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మరి జవాన్ గా సాయి ధరమ్ తేజ్ సక్సెస్ సాధించాడా..? బీవీయస్ రవి దర్శకుడిగా విజయాన్ని అందుకున్నాడా..,? కథ : జై (సాయిధరమ్ తేజ్), కేశవ(ప్రసన్న) బాల్య స్నేహితులు. ఇద్దరివి భిన్న మనస్తత్వాలు. ఒక తప్పు చేయటం మూలంగా తనకు మంచి జరుగుతుందని తెలిసినా.. తప్పు చేయననే తత్వం జైది. ఏం చేసైనా హాయిగా, గొప్పగా జీవించాలనుకునే భావన కేశవది. చిన్నతనం నుంచే తప్పుదారిలో పడిన కేశవ కారణంగా వారి కుటుంబం దూరంగా వెళ్లిపోతుంది. దేశానికి సేవచేయాలన్న ఉద్దేశంతో డీఆర్డీఓలో సైంటిస్ట్ గా ఉద్యోగం చేయాలని కలలు కంటుంటాడు జై. (సాక్షి రివ్యూస్) ఎన్నో నేరాలు చేసి మాఫియాతో సంబంధాలు పెట్టుకొని దేశానికే నష్టం చేయాలనుకుంటాడు కేశవ. భారత సైన్యం కోసం డీఆర్డీఓ తయారు చేసిన ఆక్టోపస్ అనే మిసైల్ లాంచర్ ను శత్రువులకు ఇచ్చేందుకు భారీ డీల్ మాట్లాడుకుంటాడు. ఈ డీల్ జరగకుండా జై ఎలా అడ్డుకున్నాడు..? కేశవ ఆట ఎలా కట్టించాడు..? కేశవ భారీ నుంచి తన కుటుంబాన్ని, ఆక్టోపస్ ని జై ఎలా కాపాడాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సాయి ధరమ్ తేజ్ తన గత చిత్రాలతో పోలిస్తే జవాన్ లో కొత్త లుక్ లో.. కొత్త బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. తన మార్క్ ఎనర్జీని పక్కన పెట్టి సెటిల్డ్ పర్ఫామెన్స్ తో మెప్పించాడు. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో సినిమా అంతా తన భుజస్కందాల మీదే నడిపించాడు. దేశాన్ని కాపాడాలా..? తన కుటుంబాన్ని కాపాడుకోవాలా ..? అన్న సంఘర్షణను హావభావాల్లో చాలా బాగా చూపించాడు. విలన్ గా ప్రసన్న సూపర్బ్ అనిపించాడు. ధృవ సినిమాలో అరవింద్ స్వామి తరహా స్టైలిష్ విలన్ పాత్రలో ప్రసన్న పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఈ సినిమా తరువాత ప్రసన్న తెలుగులోనూ బిజీ ఆర్టిస్ట్ అయ్యే అవకాశం ఉంది. (సాక్షి రివ్యూస్)హీరోయిన్ పాత్ర కేవలం పాటలకే పరిమితమైంది. హీరో తండ్రి పాత్రలో జయప్రకాష్ మరోసారి తన మార్క్ చూపించారు. సినిమా అంతా హీరో, విలన్ ల మధ్య జరిగే మైండ్ గేమ్ కావటంతో ఇతర పాత్రకు పర్ఫామ్ చేసేందుకు పెద్దగా స్కోప్ లేదు. విశ్లేషణ : ఇద్దరు భిన్న మనస్తత్వాలున్న స్నేహితుల కథను ఎంచుకున్న దర్శకుడు బీవీయస్ రవి.. ఆకట్టుకునే కథా కథనాలతో సినిమాను రూపొదించాడు. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకండ్ హాఫ్ ను వేగంగా నడిపించాడు. ముఖ్యంగా హీరో, విలన్ ల మధ్య వచ్చే మైండ్ గేమ్ సీన్స్ థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. హీరో, విలన్ల మధ్య జరిగి క్యాట్ అండ్ మౌస్ గేమ్ ను చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. విలన్ పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. రచయితగానూ బీవీయస్ రవి సక్సెస్ సాధించాడు. చాలా సందర్భాల్లో డైలాగ్స్ ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తాయి. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కథకు స్పీడు బ్రేకర్లలా మారాయి. (సాక్షి రివ్యూస్) పాటలు కూడా అదే ఫీల్ కలిగిస్తాయి. తమన్ అందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్య సంగీతం హైలెట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సాయి ధరమ్ తేజ్, ప్రసన్నల నటన కథనం డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : పాటలు లవ్ స్టోరి - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
సాయిధరమ్ తేజ్ ‘జవాన్’ ప్రి రిలీజ్ వేడుకలు
-
ఓ కుర్రాడి కథ ఇది – ‘దిల్’ రాజు
‘ఆర్ఎస్ఎస్కు చెందిన ఓ కుర్రాడు తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఏం చేశాడన్నదే ‘జవాన్’ కథ. మంచి లవ్ అండ్ ఎంటర్టైనర్ మూవీ. ఇది దేశానికి సంబంధించిన కథ కాదు.. ఓ కుర్రాడి కుటుంబానికి చెందిన కథ. మా ప్రయత్నం డిసెంబర్ 1న ‘జవాన్’ రూపంలో విడుదలవుతుంది’’ అని చిత్ర సమర్పకుడు ‘దిల్’ రాజు అన్నారు. సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జవాన్’. ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించిన ఈ సినిమాలోని ఒక పాటని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. బీవీయస్ రవి మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు ఇటీవల చనిపోయారు. ఆయన తర్వాత నన్ను అలా గైడ్ చేసిన ‘దిల్’ రాజుగారికి థ్యాంక్స్. చాలా గ్యాప్ తర్వాత ‘జవాన్’ సినిమా డైరెక్ట్ చేయడానికి సాయిధరమ్ కూడా ఓ కారణం. కథ వినగానే ‘మీరు డైరెక్ట్ చేయండి, నేను సినిమా చేస్తా’ అన్నారు. తమన్ ఈ సినిమాకి ప్రత్యేక శ్రద్ధతో ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ అందించాడు’’ అన్నారు. ‘‘రాజుగారు, కృష్ణగారు అవసరమైనవి యూనిట్‌కి సకాలంలో అందించి ఓ మంచి సినిమా చేయడానికి అందర్నీ ముందుకు నడిపారు’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. ‘‘కృష్ణ అన్న తొలి సినిమాకు నేను సంగీతం అందించడం ఆనందంగా ఉంది. తమ్ముడు తేజూతో నాకిది నాలుగో సినిమా. పాటలు, సినిమా... ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు తమన్. -
జవాన్లకు కేంద్రం దీపావళి కానుక
న్యూఢిల్లీ: దేశంలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే సాయుధ, పారామిలటరీ బలగాలకు కేంద్రం దీపావళి కానుక అందించింది. శాటిలైట్ ఫోన్లు వాడుకున్నందుకు జవాన్లు ప్రతి నెలా చెల్లిస్తున్న రూ.500 చార్జీలను నేటి నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్ సిన్హా ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఫోన్ల కాల్ చార్జీలను నిమిషానికి రూ.5 నుంచి రూ.1కి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. జవాన్లు తమ కుటుంబ సభ్యులతో మరింత ఎక్కువ సమయం మాట్లాడటానికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. తాజా నిర్ణయం వల్ల కేంద్రంపై రూ.3 నుంచి 4 కోట్ల భారం పడుతుందన్నారు. -
'జవాన్' వచ్చేస్తున్నాడు..!
తిక్క, విన్నర్ సినిమాలు నిరాశపరచటంతో ఇబ్బందుల్లో పడ్డ సాయి ధరమ్ తేజ్, జవాన్ సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు సాయి. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా రోజులుగా జరుగుతున్నా.. రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. తాజా ఈ సినిమా రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నవంబర్ 3న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈలోగా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమాను అక్టోబర్ 18న రిలీజ్ చేసి తరువాత కాస్త గ్యాప్ తీసుకొని జవాన్ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అదే రోజు ఆది హీరోగా తెరకెక్కిన నెక్ట్స్ నువ్వే సినిమా కూడా రిలీజ్ అవుతోంది. -
జవాన్ పెళ్లి కల చెదిరిపోయిన వేళ..
తాండూర్(బెల్లంపల్లి) : ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ వేడుకకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. జీవితాంతం చెదిరిపోని జ్ఞాపకంగా మిగిలిపోయే ఘనమైన ఘట్టమది. అలాంటి క్షణాల కోసం యువతీ యువకుల ఎదురుచూపుల గురించి చెప్పనక్కర్లేదు. సరిగ్గా అలాంటి సందర్భంలోనే జరగరానిది ఘటన జరిగితే.. ఎంత విషాదం..! ఇంద్రకుమార్... సీఆర్పీఎఫ్ జవాన్. వయస్సు 29 ఏళ్లు. తాండూర్ మండలం కిష్టంపేట గ్రామం. తండ్రి లింగాల బానయ్య చనిపోయాడు. తల్లి మల్లమ్మ, ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. అక్కాచెళ్లెళ్లకు పెళ్లి కాగా.. తల్లి, తమ్ముడికి ఇతడే ఆధారం. ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులో జరగాలని పెద్దలు అంటారు కదా! ఇంద్రకుమార్‌కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉండటంతో ఇంట్లోవాళ్లు పెళ్లి సంబం దాలు చూశారు. ఈనెల 25న నిశ్చితార్థం ఖరారు చేసి సమాచారం అందించారు. 2014లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఇంద్రకుమార్ రాయ్‌ఘడ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. తన నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు ఈనెల 19న సెలవుపై ఇంటికి వచ్చేందుకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఘోరం జరిగిపోయింది. ఇంద్రకుమార్ రైలులో వస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు వద్ద రైలునుంచి జారిపడ్డాడు. తీవ్ర గాయాలైన అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయాడు. కుటుంబసభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. సీఆర్ఎఫ్ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని శుక్రవారం కిష్టంపేటకు తీసుకొచ్చారు. వరంగల్ రేంజ్ సీఆర్పీఎఫ్ కమాండర్ రమేష్ కబాడియా, ఎస్సైలు సిగ్గు కుమార్, అర్జున్‌రెడ్డి, 58 బెటాలియన్ జవాన్లు, తాండూర్ తహసీల్దార్ రామచంద్రయ్య, తాండూర్ ఎస్సై రవి.. ఇంద్రకుమార్ భౌతికకాయంపై జాతీయ జెండాను కప్పి నివాళులర్పించారు. అనంతరం సీఆర్పీఎఫ్ జవానులు గాలిలోకి కాల్పులు జరిపి సైనిక వందనం సమర్పించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ బెటాలియన్ తరపున మృతుడి తల్లి మల్లమ్మకు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎక్స్‌గ్రేషియా, మృతుడి తల్లికి పెన్షన్‌ను త్వరగా వచ్చేలా చూస్తానని సీఆర్పీఎఫ్ కమాండర్ రమేష్ కబాడియా హామీ ఇచ్చారు. -
పవన్ బర్త్‌డే కానుకగా.. జవాన్ టైటిల్ సాంగ్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'జవాన్' టైటిల్ సాంగ్ టీజర్‌ను శనివారం విడుదల చేశారు. మెగా ఫ్యామిలీ హీరో, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ టీజర్ విడుదల చేసింది. టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తుందని దర్శకుడు బివిఎస్ రవి చెప్పారు. ఎస్.ఎస్ థమన్ అందించిన సంగీతం మూవీకి ప్లస్ పాయింట్ కానుంది. సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో భారీ హైప్స్ క్రియేట్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దేశానికి జవాన్ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి జవాన్ లోని హీరో లాంటి వ్యక్తి ఉండాలని దర్శకుడు రవి చెబుతుండగా ఈ మూవీ తేజూకి మంచి పేరు తీసుకొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇన్నాళ్లు బబ్లీ హీరోగా కనిపించిన సాయిధరమ్ ఈ సినిమాలో కాస్త హుందాగా కనిపిస్తున్నాడు. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
“జవాన్” టైటిల్ సాంగ్ టీజర్..సూపర్బ్!
-
దేశానికి మనమేమిచ్చాం!
దేశం మనకేమిచ్చిందన్నది కాదు. దేశానికి మనమేమిచ్చాం అన్నది ముఖ్యం. అయినా మనలోని దేశభక్తి ఒకడు చెప్తే గుర్తుకు రాకూడదు. దేశభక్తి అనేది కిరీటం కాదు.. కృతజ్ఞత. ఇలా ఆలోచించే ఓ కుర్రాడు తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు జవాన్లా మారి శత్రువులపై యుద్ధం చేస్తాడు. జవాన్ దేశభక్తి, దేశం కోసం అతనేం చేశాడు? అనేది సెప్టెంబర్ 1న విడుదల కానున్న ‘జవాన్’ని చూస్తే తెలుస్తుంది. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో కృష్ణ నిర్మించిన చిత్రం ‘జవాన్’. ‘‘ప్రతి ఇంటికీ మా హీరోలా ఒకరు ఉండాలని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. ఎమోషన్స్‌తో కూడిన చిత్రం. తేజ్ యాక్టింగ్ సూపర్బ్. తమన్ సంగీతం ప్రేక్షకులను అలరిస్తుంది. వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శకుడు రవి. -
ప్రేమలో జవాన్
చేతిలో సెల్‌ఫోన్.. ఆ ఫోనులో ఫ్యామిలీ ఫొటో.. అది చూస్తూ ఎమోషన్ అయ్యే హీరో స్టిల్ చూసి, ‘ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్’ అన్నారు కొందరు! హాకీ స్టిక్ పట్టుకుని కాలేజ్ గేట్ దగ్గర బైక్ మీద స్టైలిష్‌గా నిల్చున్న హీరోని చూసి, ‘ఇది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్’ అని మరికొందరు అన్నారు. అయితే అదీ ఇదీ కాదు.. టోటల్‌గా ఇది పక్కా ఫ్యామిలీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ‘జవాన్’ చిత్రబృందం అంటోంది. అలాగని లవ్‌స్టోరీ లేదనుకు నేరు. ఇందులో మంచి లవ్‌స్టోరీ ఉంది. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా బీవీయస్ రవి దర్శకత్వంలో కృష్ణ నిర్మిస్తున్న ‘జవాన్’ టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. నిర్మాత కృష్ణ మాట్లాడుతూ– ‘‘మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. జూలైలో సాంగ్స్ షూటింగ్, ఆగస్టులో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి, సెప్టెంబర్ 1న సినిమా విడుదల చేస్తాం. మెగా అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుంది’’ అన్నారు. ‘‘సాయిధరమ్ ఈ కథలో ఇన్వాల్వ్ అయ్యి, మరీ చేస్తున్నాడు. ఈ సినిమా అనుకున్నట్టుగా బాగా వచ్చింది’’ అన్నారు చిత్ర సమర్పకుడు ‘దిల్’ రాజు. బీవీయస్ రవి మాట్లాడుతూ– ‘‘జవాన్’ కథ ఏంటి?, మాస్ కమర్షియల్ హీరోగా సాయిధరమ్‌ని ఎలా చూపించబోతున్నారు? అంటూ అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అడుగు తున్నారు. మంచి కథాంశంతో తెరకెక్కుతోంది. సాయి ఇప్పటివరకూ చెయ్యని ఓ మంచి పాత్ర చేస్తున్నాడని మాత్రం చెప్పగలను’’ అన్నారు. ప్రసన్న, జయప్రకాష్, ఈశ్వరీ రావ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: తమన్. -
'జవాన్' సినిమా స్టిల్స్