నా ముఖం బాగోలేదని సర్జరీ చేయించుకోమన్నారు: నటి | Sanya Malhotra Recalls Jaw Surgery During Dangal | Sakshi
Sakshi News home page

Sanya Malhotra: 'దంగల్‌' షూటింగ్‌ సమయంలో సర్జరీ చేయించుకోమన్నారు, అది చూసి నాకు ఛాన్సులు..

Published Mon, Jun 5 2023 4:50 PM | Last Updated on Mon, Jun 5 2023 5:11 PM

Sanya Malhotra Recalls Jaw Surgery During Dangal - Sakshi

బాలీవుడ్‌ నటి సన్యా మల్హోత్రా నటించిన 'కథల్‌' ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. పోలీస్‌ ఆఫీసర్‌గా మెప్పించిన మల్హోత్రా పేరు ప్రస్తుతం బాలీవుడ్‌లో మారుమోగిపోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ క్రమంలో తన సినీ కెరీర్‌ ఎంట్రీలో ఎదురైన కొన్ని ఇబ్బందులను పంచుకుంది.

(ఇదీ చదవండి: సైతాన్‌ ట్రైలర్‌.. పచ్చిబూతులు, అడల్ట్‌ సన్నివేశాలు!)

సర్జరీ చేయించుకోమని సలహా
''నాకు ఇప్పటికీ గుర్తు.. దంగల్‌ సినిమా షూటింగ్‌​ సమయంలో ఒకరు నా రూపురేఖలు బాగాలేవని, అందుకోసం దవడకు శస్త్ర చికిత్స చేయుంచుకోవాలని సలహా ఇచ్చారు. అప్పుడు నేను ఒక్కటే చెప్పాను.. నా అందం పట్ల సంతోషంగానే ఉన్నాను. నా దవడను చూసి అవకాశాలు రాలేదు, అలా అని వచ్చిన ఛాన్సులు పోలేదు కూడా! నేను ముంబైకి ఆడిషన్స్‌ కోసం వచ్చినప్పుడు కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నాను. కాన్ఫిడెన్స్‌తో ముందుకు సాగాను'' అని గుర్తు చేసుకుంది. దంగల్‌ మూవీలో అమీర్‌ ఖాన్‌, ఫాతిమా సనాలతో కనిపించింది మల్హోత్రా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఇప్పుడు జవాన్‌లో షారుఖ్‌ ఖాన్‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది.

(ఇదీ చదవండి: గ్రాండ్‌గా సుమలత తనయుడి వివాహం, పెళ్లి ఫోటోలు వైరల్‌)

జవాన్‌లో ఛాన్స్‌
ఈ విషయం గురించి మాట్లాడుతూ.. “బాలీవుడ్‌లో నేనే అదృష్టవంతురాలిని. దయచేసి దీనిని హెడ్‌లైన్‌గా ఉపయోగించకండి. గొప్ప నటీనటులతో కలిసి పనిచేయాలని నేను చిన్నప్పుడు కలలు కనేదాన్ని.. నేను జవాన్‌లో భాగమని ఈ వార్తను అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది'' అని మల్హోత్రా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే జవాన్‌లో షారుఖ్‌ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో విజయ్, దీపికా పదుకొణె అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement