'అవన్నీ రూమర్స్.. మహేష్ తో సినిమా లేదు' | Sai Dharam tej About film with Super Star Mahesh babu | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 1 2017 2:15 PM | Last Updated on Fri, Dec 1 2017 2:15 PM

Sai Dharam tej About film with Super Star Mahesh babu - Sakshi

సూపర్ స్టార్ మహేష్ బాబు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ సినిమా రానున్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో కలిసిన మహేష్, సాయి ధరమ్ లతో దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడట. అయితే ఆ హీరోలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోయినా.. మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. తాజాగా జవాన్ ప్రమోషన్ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఈ ప్రాజెక్ట్ పై స్పందించాడు.

తాను మహేష్ బాబుతో కలిసి సినిమా చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్నీ రూమర్సే అని కొట్టి పారేశాడు. ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్నట్టుగా తెలిపిన సాయి, మంచి కథతో దొరికితే వరుణ్ తేజ్ తో కలిసి ఓ సినిమా చేసే ఆలోచన ఉన్నట్టుగా చెప్పాడు. వీటితో పాటు గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీస్ సంస్థలతోనూ సినిమాలు చేయనున్నట్టుగా ప్రకటించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement